సుదీక్ష కాలేజీలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

by vvwnews.com

సుదీక్ష కాలేజీలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు*
గాజువాక నియోజకవర్గం కూర్మన్నపాలెంలో ఉన్న సుదీక్ష జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో స్థానిక కన్వెన్షన్ హాల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దువ్వాడ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ ఎస్సై సురేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాలేజీ చైర్మన్ ఎన్న. అప్పలనాయుడు, వైస్ ప్రిన్సిపల్ సుధా, ట్రాఫిక్ ఎస్ఐ సురేష్ గారు చేతుల మీద గా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా జ్యోతి ని వెలిగించి,సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటోకు పూలమాలవేసి అందరూ నమస్కరించిన తర్వాత ట్రాఫిక్ ఎస్ఐ కాలేజీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యతోపాటు విజ్ఞానం కూడా చాలా అవసరం అని గురువుల, తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉండాలని ఉన్నతమైన శిఖరాలకు చేరాలంటే పిల్లలకు క్రమశిక్షణ తప్పనిసరిగా ఉండాలని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు బైక్స్ ఇవ్వకూడదని,డ్రైవింగ్ చేయకూడదని, మైనర్ పిల్లలు డ్రైవింగ్ చేయటం వల్ల కొన్ని వందల కుటుంబాలు రోడ్లు పడుతున్నాయని కాబట్టి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త లు పాటించాలని, చెడు చేస్తున్నారు కు దూరంగా ఉండాలని చెబుతూ మరొకసారి సుదీక్ష కాలేజ్ యాజమాన్యానికి,విద్యార్థులకు, ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు, అలాగే కాలేజీ చైర్మన్ అప్పలనాయుడు,వైస్ ప్రిన్సిపల్ సుధామేడం మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ వృత్తి చేస్తూ అంచెలు అంచెలుగా ఎదిగి చివరికి దేశంలో ప్రధమ పౌరుడి స్థానమైన రాష్ట్రపతి స్థానాన్ని చేపట్టి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చారని తెలిపారు,అలాగే ఈనాటి ఉపాధ్యాయులు పిల్లలందరూ కూడా ఆయననీ ఆదర్శంగా తీసుకొని తమ జీవితంలో ఎదగాలని, అలాగే ఉన్నతమైన విద్యతోపాటు, సంఘంలో క్రమశిక్షణ తో కూడిన నడవడిక ను కూడా నేర్పించడం మా కాలేజీ యొక్క ప్రథమ కర్తవ్యం అని టీచర్స్ డే సందర్భంగా పిల్లల చేత డాన్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యాజిక్ షో, మ్యూజికల్ చైర్స్,క్విజ్ నిర్వహించి పిల్లలు ఆటలతో పాటలతో నృత్యం ద్వారా మరియు తమ ప్రసంగాలలో గురు భక్తిని తెలియజేసినందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ఉపాధ్యాయులు ప్రశాంత్, శ్రీకృష్ణ,శ్రీవాస్తావ్, మురళి, కరీం, సింధు తదితర ఉపాధ్యాయులను సన్మానించితిరి.

Use Social Media to Spread the Word about Our News

related articles