ప్రకృతి వనరుల పరిరక్షణమన బాధ్యత
– పర్యావరణ హితంగా జీవించండి.
– వన్యప్రాణుల కోసం నీరు అందుబాటులో ఉంచండి
– గుడ్డ సంచులను వినియోగించండి
– సింహాచలం, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, ఆంధ్ర యూనివర్సిటీ
ప్రకృతి వనరుల పరిరక్షణమన బాధ్యత అని ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని 315 కళాశాలలోని ఎన్ఎస్ఎస్ విభాగాలకు కోఆర్డినేటర్ గా ఉన్న సింహాచలం అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో నేతృత్వంలో మొక్కలు నాటి, పశుపక్ష్యాదులు కోసం మట్టి పాత్రలో నీరు, పక్షుల కోసం ధాన్యపు కంకుల గుత్తులు ఏర్పాటు చేసి, కోరమాండల్ ఫెర్టిలైజర్స్ వారి గుడ్డ సంచులు పంపిణీ చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలి అని కోరారు. వన్యప్రాణుల కోసం నీరు అందుబాటులో ఉంచాలి అన్నారు. ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ ను వినియోగించవద్దన్నారు, ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులను వినియోగించండి. అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం మాట్లాడుతూ భూగోళం సమస్త జీవరాశి తో కళకళలాడాలని, లేకుంటే మానవాళికి పెనుముప్పు ఏర్పడుతుందని వివరించారు. ప్రకృతి వనరులకు నష్టం కలిగిస్తే, దానివల్ల ఈ సంస్థ జీవరాశికి నష్టం కలుగుతుంది అన్నది గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి విద్యార్ది పర్యావరణ హితంగా జీవించాలి అని కోరారు. ప్రతి విద్యార్థి తాము ఆహారంగా తీసుకున్న పండ్ల విత్తనాలను పరిరక్షించాలని, సీడ్ బాల్స్ తయారు చేసి కొండలపైన, మైదాన ప్రాంతాలలో, తీరప్రాంతాలలో, చెరువు గట్ల మీద వేసి సామాజిక వనాలు పెంపొందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ యు ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ టీచింగ్ ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొని మాట్లాడారు.
ప్రకృతి వనరుల పరిరక్షణమన బాధ్యత – పర్యావరణ హితంగా జీవించండి🍏💚 గ్రీన్ క్లైమేట్ టీం
31