*విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి*
*టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు*
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నతమైన, విలువలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు.
ఐక్యరాజ్య సమితి ప్రజాస్వామ్య దినోత్సవంను పురష్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అందిస్తున్న సర్వేపల్లి రాధాక్రిష్ణ విద్యామిత్ర కిట్లను భీమిలి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించారు. భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశానుసారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన గంటా నూకరాజు చేతులమీదుగా విద్యార్థులకు కిట్లను అందించిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న కూటమి సర్కార్ విద్యా వ్యవస్థ మెరుగుకు విశేష కృషి చేస్తుందని అన్నారు. గత వైసిపీ ప్రభుత్వం కారణంగా దారితప్పిన విద్యా వ్యవస్థను మానవ వనరుల శాఖామంత్రి నారా లోకేష్ ఒక చాలెంజ్ గా తీసుకొని ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు. కార్పొరేట్ పారశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంలో నారా లోకేష్ పాత్ర అమోఘమని అన్నారు. అందులో భాగంగానే 16 వేలకు పైగా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తున్నారని అన్నారు. అంతే కాకుండా ప్రతీ ఏడాది డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని అన్నారు. నాణ్యమైన విద్యా కిట్లతో పాటు మధ్యాహ్నం భోజనం పధకంలో విద్యార్థులకు సన్నబియ్యం ద్వారా ఆహారాన్ని అందించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ప్రతీ ఒక్క విద్యార్ది ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలను సద్వినియోగం చేసుకొని ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టాలని, తల్లిదండ్రులకు, విద్యను నేర్పే ఉపాధ్యాయులకు, ఉన్న ఊరికి మంచి పేరు తీసుకు రావాలని గంటా నూకరాజు ఆకాంక్షించారు
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పి. రమణ, ఇంచార్జ్ ఉపాధ్యాయులు జి. ప్రభాకర్, విద్యా కమిటీ చైర్మన్ శారద మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కాసరపు నాగరాజు, సంకురుభుక్త జోగారావు, జలగడుగుల మురళి, కుప్పిల గురుమూర్తి, రాజగిరి రమణ, నెక్కెళ్ళ వెంకటరావు, వియ్యపు పోతురాజు, కృష్ణారావు మాస్టర్, వాసుపల్లి వంశీ మరియు పాఠశాల ఉపాధ్యాయులు రాధా కుమారి, హైమావతితో పాటు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.