హరేకృష్ణ మూవ్మెంట్ , ఐఐఎం రోడ్ గంభీరం
ప్రత్రికా ప్రకటన “పాణిహాటీ” పండుగ
ఈ సంవత్సరము ఈ ఉత్సవమును 09-06-2025 సాయంత్రం
4 గంటలకు భీమునిపట్నం బీచ్ లో గోస్తనీ నది సంగమం ప్రదేశంలో అంగరంగ వైభోగముగా హరే కృష్ణ మూవ్మెంట్ భక్తులు నిర్వహించడం జరిగింది .
ఈ కార్యక్రములో నిర్వహించు కార్యక్రమాలు
1..సంకీర్తన భక్తులు సామూహికంగా వివిధ సంగీత వాద్యములు లతో లయభద్దముగా నాట్యం చేయుచు సంకీర్తన నిర్వహించడం జరిగింది .
2..శ్రీ శ్రీ శ్రీ నితాయి గౌరంగ ( శ్రీ కృష్ణ బలరాములు) విగ్రహాలకు అభిషేఖం :“శ్రీ చైతన్య మహాప్రభు” మరియు” శ్రీ నిత్యానంద” ప్రభువుల(శ్రీ కృష్ణ బలరాములు) విగ్రహాలకు సప్త నదులనుంచి సేకరించిన జలాలతో, వివిధ పండ్ల రసాలు, పంచగవ్యాలతో మరియు వివిధరకాల పూలతో కనులపండుగగా అభిషేకములు నిర్వహించడం జరిగింది.
3.. తెపోత్సవం:శ్రీ చైతన్య మహాప్రభు” మరియు” శ్రీ నిత్యానంద” ప్రభువుల(శ్రీ కృష్ణ బలరాములు) విగ్రహాలకు నదిలో పుష్ప వర్షం కురిపిస్తూ తెపోత్సవం నిర్వహించడం జరిగింది .
ఈ కార్యక్రమములో భక్తులకు డాక్టర్ నిష్కించన భక్త దాస ప్రెసిడెంట్ హరే కృష్ణ మూవ్మెంట్ ,విశాఖపట్నం వారు భక్తులకు “పాణిహాటీ” ఉత్సవం ప్రాముఖ్యత ను భక్తులకు వివరించినారు.
“పాణిహాటీ” అనే గ్రామము “కలకత్తా” నగరానికి 10 మైళ్ళ దూరంలో “ వెస్ట్ బెంగాల్” రాష్ట్రంలో ఉంది. ఈ స్థలము ప్రాచీనకాలంలో ఆధ్యాత్మిక మైనది మరియు” హరేకృష్ణ మూవ్మెంట్” వ్యవస్థాపకులు” శ్రీ చైతన్య మహా ప్రభువు”కు ఈ ప్రదేశము చాల దగ్గర సంబంధము కలిగి ఉన్నది.” శ్రీ కృష్ణబలరాములు” కలియుగములో 500 సంవత్సరముల క్రితం “శ్రీ చైతన్య మహాప్రభు” మరియు” నిత్యానంద ప్రభువు”లుగా జన్మించి కృష్ణ తత్వాన్ని వ్యాప్తి చేయడం జరిగినది. “నిత్యానంద ప్రభువులు” “పాణిహాటీ” అనే ప్రదేశములో 500 సంవత్సరంల క్రితం “శ్రీ చైతన్యమహాప్రభువు”తో కలిసి సంకీర్తన నిర్వహించి “పాణిహాటీ” “చిదా దహియా” అనే మహోత్సవాన్ని నిర్వహించిన రోజును కృష్ణ భక్తులు “పాణిహాటీ” అనే పండుగను నిర్వహించడం సంప్రదాయంగా వస్తున్నది.
ఈ పండుగ ప్రత్యేకము పాలు, అటుకులు, పెరుగు, పంచదార, అరటిపళ్ళు మరియు బెల్లంతో తయారుచేసినటువంటి ప్రసాదాలను భక్తులు భగవంతునికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం జరిగింది .
ఇట్లు
శ్రీ అంబరీష దాస
హరే కృష్ణ మూవ్మెంట్ , గంభీరం , ఐఐఎం రోడ్