విశాఖ స్టీల్ ప్లాంట్ లో మే 20 వ తారీకు సమ్మెను జయప్రదం చేయండి అని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాలు కార్మికులకు పిలుపునిచ్చాయి. ఈరోజు స్టీల్ ప్లాంట్ బిసి గెట్ వద్ద స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20 సమ్మె, స్టీల్ కార్మికులకు సస్పెన్షన్, షో కాజ్ నోటీసులు ఉపసంహరించుకోవాలని, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించరాదని ప్రధాన డిమాండ్లతో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షులు జె అయోధ్యరామ్ అధ్యక్షత వహించారు.
దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా సిఐటి నాయకులు ఎన్ రామారావు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ లో అప్రకటిత ఎమర్జెన్సీని యాజమాన్యం అనుసరిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. కార్మికులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను, సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ యాజమాన్యం వైఖరి ఉందని ఆయన వివరించారు. ప్రభుత్వ యాజమాన్యాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా గళం ఎత్తిన కార్మిక సంఘాలను, కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు దిగడం అత్యంత దుర్మార్గమని ఆయన అన్నారు. పూర్తిస్థాయి ఉత్పత్తి స్టీల్ ప్లాంట్ లో జరగాలంటే తగిన మానవ వనరులు ఉండాలని యాజమాన్యానికి తెలీదా అని ఆయన ప్రశ్నించారు. కార్మిక సమస్యలను సృష్టిస్తూ యాజమాన్యం అనైతికంగా వ్యవహరిస్తుందని దీనికి వ్యతిరేకంగా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపునకు ఆపాలని మే 20 వ తారీకు జరిగే సమయం పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎ ఐ టి యు సి ప్రధాన కార్యదర్శి డి ఆదినారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తపు సమ్మె వాయిదా పడినప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మే 20 వ తారీకు విశాఖ ఉక్కు కర్మాగారంలో పెద్ద ఎత్తున సమ్మెలో కార్మిక వర్గం పాల్గొనాలని ఆయన అన్నారు. దీనికి ప్రధాన కారణం స్టీల్ యాజమాన్యం స్టీల్ కార్మికులకు నేటికీ పూర్తి వేతనాలు చెల్లించడంలో వైఫల్యం చెందిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. అలాగే హెచ్ఆర్ఏ, కరెంటు చార్జీలు పెంపుతో కార్మికులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను వారి ఉపాధి నుండి దూరం చేసి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులకు తీవ్ర విఘాతాన్ని సృష్టిస్తున్నారని ఆయన వివరించారు. యాజమాన్యం ఇదే వైఖరిని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు.
సభాధ్యక్షులు జె అయోధ్యరామ్, స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు డివి రమణారెడ్డి, టి జగదీష్, జె రామకృష్ణ మాట్లాడుతూ స్టీల్ యాజమాన్యం అనైతికంగా అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం మే 20 జరిగే సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వై టి దాస్, యు రామస్వామి, స్టీల్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షులు బి తౌడన్న, ఎఐటియుసి నాయకులు మసేన్ రావు, స్టీల్ సిఐటియు నాయకులు పి శ్రీనివాసరాజు, మరిడయ్య, టి వి కె రాజు, వి ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, మహేష్, రాజు, శ్రీనివాస్ తదితరులతో పాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.
వి ప్రసాద్
స్టీల్ సిఐటియు
కార్యదర్శి
విశాఖ స్టీల్ ప్లాంట్ లో మే 20 వ తారీకు సమ్మెను జయప్రదం చేయండి అని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాలు
27