*ప్రచురణార్థం*
*మే 20 జాతీయ సమ్మెను జయప్రదం చేయండి.* —————————————-
మే 20 అఖిల భారత సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు మద్దిలపాలెం, ఆరిలోవ, మధురవాడ జోన్ కమిటీలు ప్రెస్ మీట్ మద్దిలపాలెం ఆఫీసులో ఉదయం 11 గంటలకి నిర్వహించడం జరిగింది.
ఈ ప్రెస్ మీట్ లో సమ్మె పోస్టర్ ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్బంగా పి వెంకట్రావు, డి అప్పలరాజు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికులకు నష్టమైన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికవర్గం పోరాడి సాధించిన 44 కార్మిక చట్టాలను కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ గా మార్చడాన్ని ఖండించారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ యజమానులకు, బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందని విమర్శించారు. ఈ లేబర్ కోడ్స్ అమలు అయితే కార్మిక వర్గం అనేక హక్కులను కోల్పోతుందని అన్నారు. తక్షణం 44 కార్మికు చట్టాలు అమలు చేయాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల జీతాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచడం లేదని, ప్రస్తుతం ధరల ప్రకారం కనీస వేతనం 26,000 అమలు చేయాలని కోరారు. 33 మంది ప్రాణ త్యాగంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ను సాధించుకున్నామని ఈ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించరాదని డిమాండ్ చేశారు. బ్యాంకులు ఇన్సూరెన్స్ రంగం మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని తక్షణం ఈ ప్రైవేటీకరణ విధానాలు ఆపాలని, ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని అన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ కూడిన సమగ్ర చట్టం చేయాలని, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో, సంఘటిత, అసంఘటిత రంగాల్లో మే 20 సమ్మెపై ప్రచారం విస్తృతంగా నిర్వహించాలని, సమ్మె నోటీసులు అందజేస్సిందన్నారు. ఈ సమ్మెలో విశాఖ జిల్లాలోని కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు. మే 20 న సమ్మె పాటిస్తూ కార్మిక వర్గం మొత్తం రైల్వే డిఆర్ఎం ఆఫీస్ నుండి జీవీఎంసీ గాంధీ బొమ్మ వరకు ర్యాలీ సభ జరుగుతుందన్నారు. ఈ ప్రెస్ మీట్ లో సిఐటియు నాయకులు నరేంద్ర కుమార్, రాజ్ కుమార్, ఐసీ నాయుడు, ఏ సింహాచలం, లక్ష్మణరావు, వెంకటరమణ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇట్లు. పి వెంకటరావు. కార్యదర్శి. సిఐటియు మద్దిలపాలెం జోన్ కమిటీ
44 కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ గా మార్చడాన్ని ఖండించారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
81