అమరావతి నిర్మాణంలో అక్రమాల పుట్ట…. అన్యాయం పై ప్రశ్నించే మనిషి ఎందుకు ప్రశ్నించడం లేదు?
కూటమి ప్రభుత్వంపై కోనసీమ వైసీపీ అధ్యక్షులు చిర్ల ఫైర్…
ప్రజలకు అందాల్సిన డబ్బును అమరావతి కు మళ్లీస్తున్నారని, అందులో కమిషన్ రూపంలో నేతలు లాక్కొవడానికి ఎక్కువుగా ఉంటుందని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి కూటమి ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. ప్రశ్నించేందుకు నేను ఉన్నాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించడే అంటూ జగ్గిరెడ్డి ప్రశ్నలు వేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పునః ప్రారంభించాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలోనే జిల్లా వైస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చెప్పడతామన్నారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ లు కుడుపూడి సూర్య నారాయణ, బొమ్మి ఇజ్రాయల్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, అమలాపురం ఇంచార్జి పినిపే శ్రీకాంత్, పి గన్నవరం ఇంచార్జి గన్నవరపు శ్రీను, చెల్లుబోయిన శ్రీను, పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు…