ఉన్నతశ్రేణి వేసవి దుస్తుల ప్రదర్శన
విశాఖపట్నం 3 మే 2025: విశాఖ వాసుల వేసవి ఎండను చల్లబరచుటకు సూత్రా ఫ్యాషన్ ఎగ్జిబిషన్ విశాఖ నగరానికి వచ్చేసింది. ఈ రోజు నగరంలోని నోవాటేల్ హోటల్ నందు సూత్రా వారు అద్భుతమైన ఫ్యాషన్ దుస్తులతో పాటు హాయినిచ్చే వేసవి దుస్తుల ప్రదర్శనను ఏర్పాటు చేసారు. ఈ ప్రదర్శన మరియు అమ్మకాలు మే 3 మరియు 4 తేదీలలో రెండు రోజులు మాత్రమే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన ఫ్యాషన్ ప్రపంచం అన్ని రకాల సాంప్రదాయ మరియు ఆధునిక వస్త్రాలు ప్రతి వేడుకకు అవసరమైనవి ఈ ప్రదర్శనలో లభిస్తాయి. ఈ సూత్రా ప్రదర్శనను శ్రీ ఉమేష్ మాద్యం, మేనేజింగ్ డైరక్టర్, సూత్రా గారితో కలసి కె.నీలిమ, లక్ష్మి పత్తి, సునీత దుగార్, మరియు రచన సంచిత సంయుక్తంగా ఈరోజు ప్రారంభించారు.
వేసవి సూర్యుని తాపాన్ని చల్లబరిచి మీకు అత్యంత ఉత్సాహాన్ని మరియు ఆనందాన్ని అందించే ఎన్నో దుస్తులు ఈ ప్రదర్శనలో నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. మీరు ఆశించిన విధంగా మరియు మీ కలలను సాకారం చేసే పలు రకాల ఆకర్షణీయమైన వస్త్ర సంపదను మీరు ఇక్కడ పొందవచ్చును. డిజైనర్స్ పని నైపుణ్యత నిండిన వస్త్రాలు, సూర్యకాంతిన