మేడే కవాతు ఉద్దేశించి మాట్లాడుతున్న రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు

by vvwnews.com

ప్రచురణార్థం
తేదీ: 1-5-25

మే డే స్ఫూర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకుందాం

మే డే స్ఫూర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోడాని కి పోరాటాన్ని మరింత ఉధృతం చేద్దామని రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు పిలుపునిచ్చారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట స్టీల్ సిఐటియు కార్యకర్తలు మేడే కవాతు ను నిర్వహించారు. మేడే పతాకాన్ని సిహెచ్ నర్సింగరావు ఆవిష్కరించారు.
అనంతరం మేడే సభలో సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ పెట్టుబడిదారి ఆర్థిక విధానాలను ద్వారా ప్రపంచ ఆర్థిక సంక్షోభం రోజురోజుకీ మరింత తీవ్రమవుతోందని ఆయన అన్నారు. దీని ఫలితంగానే అనేక పరిశ్రమలు మూతబడుతున్నాయని ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగం పెరిగి,ఆర్థిక అసమానతలు పెరిగి తద్వారా తీవ్రవాదం, అరాచకాలు పెరుగుతున్నాయని ఆయన వివరించారు. అదేవిధంగా నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పని ప్రదేశాలలో కార్మికులను కట్టు బానిసలుగా చేయడానికి కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా అమలులోకి తీసుకు వస్తున్నారని ఆయన వివరించారు. దీనికి వ్యతిరేకంగా మే 20 జరుగుతున్న దేశవ్యాప్తపు సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షులు జె అయోధ్య రామ్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ లో కార్మిక చట్టాలు ఉన్నప్పటికీ నేడు యాజమాన్యం వాటిని ఉల్లంఘిస్తూ కార్మిక హక్కులపై తీవ్రంగా దాడి చేస్తోందని ఆయన అన్నారు. కార్మికులపై అనేక రకాల ఆంక్షలుతో అరకొర జీతాలు చెల్లిస్తు, హెచ్ఆర్ఏ నిలుపుదల చేయడం, ఉక్కునగరంలో కరెంటు చార్జీలు పెంచడం తదితర కార్యక్రమాల ద్వారా కార్మికులను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. కనుక ఈ సమయంలో ఐక్య ఉద్యమాలను మరింత బలోపేతం చేయడం ద్వారా ప్రభుత్వ యాజమాన్యాల వైఖరికి వ్యతిరేకంగా మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు రామస్వామి మాట్లాడుతూ ప్లాంట్ ఆర్థిక సంక్షోభం పేరుతో కార్మికులు పొందుతున్న అనేక సౌకర్యాలను నిలుపుదల చేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పటికీ స్టీల్ యాజమాన్యం మరియు ప్రభుత్వం సౌకర్యాలను పునరుద్ధరించడం లో సుముఖంగా లేదని ఆయన వివరించారు. లేబర్ కోడ్ లు రద్దుకై మే 20 అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు నాయకులు ఎం రామారావు, కె ఎం శ్రీనివాస్, స్టీల్ సిఐటియు నాయకులు పి శ్రీనివాసరాజు, బి అప్పారావు, టివి కె రాజు, మరిడయ్య, పుల్లారావు, నీలకంఠం, కె గంగాధర్, కృష్ణమూర్తి, వి ప్రసాద్, బి ఎన్ మధుసూదన్, శ్రీనివాసరెడ్డి, బి మహేష్, భానుమూర్తి, రాజా, పృథ్వి, సంతోష్, లోకేష్, రమేష్, తిమోతి బాబు, సత్యనారాయణ, రాజు తదితరులతో పాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి కళాకారులు మే డే విప్లవ గీతాలను ఆలపించారు.
వి ప్రసాద్
కార్యదర్శి

Use Social Media to Spread the Word about Our News

related articles