జై అసోసియేషన్ ఆధ్వర్యంలో తేదీ 30 4 2025 ఉదయం 10 గంటలకి 139వ మే డే ని ఘనంగా నిర్వహించారు కె చంటి ఎర్రజెండా ఆవిష్కరించారు అనంతరం జరిగిన సభను ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ అనుబంధ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి మాట్లాడుతూ 1886 మే 1న అమెరికా దేశం చికాగో నగరంలో కార్మికు వర్గం 8 గంటల పని విధానం అమలు చేయాలని పోరాడి అమరులైన మేడే అమర జీవులకు జోహార్లు అర్పించారు నాడు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ప్రజా హక్కులను నేటి పాలకులు హరిస్తున్నారని మండిపడ్డారు కేంద్రంలో మోడీ రాష్ట్రంలో బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత డీజిల్ పెట్రోల్ నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెంచి డ్రైవర్లకు ఆహార భద్రత లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు భారీగా జరిమానాల పెంచే జీవో నెంబర్ 21 31 రద్దు చేయాలని డ్రైవర్ లందరికీ పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని భారీగా పెంచిన డీజిల్ పెట్రోల్ నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించి డ్రైవర్లకు ఆహార భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఆటో డ్రైవర్ల జీవన ఉపాధికి ప్రమాదకరంగా ఉన్న ఊబర్ ఓలా రాపిడి వాహనాలను నగర పరిధిలో నిషేధించి ఆటో డ్రైవర్ ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్ల హక్కులను హరిస్తే ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు మే 20 దేశవ్యాప్తంగా జరుగు సార్వత్రిక సమ్మెలో ఆటో డ్రైవర్లు మోటార్ వాహన డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వాలు కళ్ళు తెరిపించాలని డ్రైవర్లకు పిలుపునిచ్చారు 139వ మే డే ను ఘనంగా నిర్వహించిన డ్రైవర్లకు అభినందనలు తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం మేడేని సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమాలు ఆటో సంఘం జిల్లా నాయకులు వై వెంకటి నాయకులు కె అప్పలరాజు ఎల్ పరశురాం పిల్లా శంకర్ ఎస్ అనిలు వి సంతోష్ కే రాము తదితరులు పాల్గొన్నారు ఇట్లు కే చంటి స్టాండ్ అధ్యక్షులు
జై అసోసియేషన్ ఆధ్వర్యంలో 139వ మే డే ని ఘనంగా నిర్వహించారు కె చంటి ఎర్రజెండా ఆవిష్కరించారు
35