52
*అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్ గారి అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటి సమీక్షా సమేవేశం నిర్వహించారు.సమావేశం లో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు,హోం మంత్రి వంగలపూడి ఆనిత,అనకాపల్లి మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ,పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు,అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్,ఎస్పీ తుహిన్ సిన్హా, జిల్లా ప్రజా ప్రతినిధులు మరియు ప్రభుత్వ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. సమీక్ష సమావేశం అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలు మరియు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారులతో మూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన అంశాల గురించి తెలియజేసారు.*