టెర్రరిస్టుల ఘాతకాన్ని ముస్లింను నిందించడం తప్పు!

by vvwnews.com

టెర్రరిస్టుల ఘాతకాన్ని ముస్లింను నిందించడం తప్పు!

* ఈ దారుణంపై ముస్లింలందరూ కూడా చింతిస్తున్నారు..

* సోషల్ మీడియాలో తప్పుడు వ్యాఖ్యలపై “వాసుపల్లి” ఫైర్

పహల్గాం లో జరిగిన ఘటనపై ముస్లింలకు ఏమిటి సంబంధం ఉంది అంటూ మాజీ ఎమ్మెల్యే, దక్షిణ వైసిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఫైర్ అయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉగ్రదాడిలో అమరులైన కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ వైసీపీ శ్రేణులు అర్పించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ కాశ్మీర్ సరిహద్దుల్లో తాను కూడా పనిచేసిన అనుభవం ఉందని, అక్కడి ముస్లింలు కూడా ఎంతో మంచివారు ఉన్నారన్నారు. అలాగే జరిగిన ఘటనలో టెర్రరిస్టులు చేసారని ముస్లిం సోదరులు కాదన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ వారిపై నిందలు వేయడం సరికాదన్నారు. భారతదేశంలో జరిగిన ఇటువంటి దుర్ఘటనలపై మన ముస్లిం సోదరులు కూడా ఎంతో విచార వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించిన కార్యక్రమంలో పాలుపంచుకోవడం అభినందనీయమన్నారు. టూరిస్ట్ ప్రదేశమైన అక్కడి ప్రాంతంలో ఇటీవల తన కొడుకు సూర్య, కోడలు కూడా వెళ్లారన్నారు. శ్రీనగర్, పహల్గాం ప్రాంతాలలో కూడా పర్యటించారు అన్నారు. అయితే అదే పహల్గాంలో మన భారతీయులను ఇండియన్ ఆర్మీ వేషధారణలో టెర్రరిస్టులు వచ్చి చేసిన దుర్మార్గపు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసన మండల ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే మల్లా విజయ ప్రసాద్, వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, వైఎస్ఆర్సిపి ముస్లిం నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles