శ్రీఅన్నమాచార్య సంకీర్తనా పోటీల విజేతలకు బహుమతి ప్రధానం —–
ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో శృతిలయ భక్తి సంగీత సేవా సంస్థ వ్యవస్థాపకులు వి ప్రభాకర్ సారధ్యంలో అన్నమాచార్యుని జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన అన్నమాచార్య సంకీర్తనా పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సెంచూరియన్ గౌరవ చాన్సులర్ ఆచార్య జిఎస్ఎన్ రాజు , పి రంగనాథ అచార్యులు జ్యోతిని వెలిగించి ప్రారంభించారు . అనంతరం జిఎస్ఎన్ రాజు ప్రసంగిస్తూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార విశిష్టతను , అన్నమాచార్యుల వారు సంకీర్తనా రూపంలో ఈ లోకానికి తద్వారా సమాజానికి స్వామివారి భక్తులకు తెలియజేశారని అన్నారు . సంకీర్తనా పోటీలలో పాల్గొన్న విద్యార్థులు ఒక్క సంగీతం లొనే కాకుండా విద్యలోని కూడా రాణించాలన్నారు . ఆధ్యాత్మిక సంస్థ శృతిలయ చేపడుతున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను ప్రశంసించారు . అనంతరం ముఖ్యఅతిథి ఆచార్య జీఎస్ఎన్ రాజు గారి చేతుల మీదుగా సమాజానికి విశిష్టమైన సేవలందిస్తున్న శ్రీ వైఖానస ఆగమ సాంప్రదాయ పండితులు పి రంగనాథ ఆచార్యులు , ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి వీటెలీ డిజిటల్ న్యూస్ బ్యూరో చీఫ్ ఎం ఎస్ ఆర్ ప్రసాద్‌లకు ఉత్తమ సేవా పురస్కారాలను అందజేసి , న్యాయ నిర్నేతలను సత్కరించి , అన్నమాచార్య సంకీర్తనా పోటీలలో వివిధ విభాగాలలో విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు , పోటీదారులకు , ప్రశంసా పత్రాలను జ్ఞాపికలను బహుమతులను అందజేయడం జరిగింది . కార్యక్రమంలొ గౌరవ అతిధి వంకాయల సన్యాసిరాజు , ప్రత్యేక ఆహ్వానితులుగా ఏ వెంకట్రావు , సంస్థ అధ్యక్షులు వి ప్రభాకర్ , కార్యదర్శి ఎం ఎస్ మాధవ్ , ప్రోగ్రాం కన్వీనర్ సిహెచ్‌వి సత్యనారాయణ , కోఆర్డినేటర్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎం వి రాజశేఖర్ , కొణతాల రాజు , పి వెంకటేశ్వరరావు , ఎం మస్తాన్ రెడ్డి , నాంచారయ్య పివిఎస్వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు . నగరానికి చెందిన శ్రీ సాయి కళానికేతన్ , భువన గాయత్రి నృత్య శిక్షణాలయం విద్యార్థినులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి . —–
మనవి : ఈ కార్యక్రమాన్ని ఫోటోతో సహా కవర్ చేసి సహకరించవలసిందిగా పాత్రికేయ మిత్రులను కోరడమైనది .
శృతిలయ భక్తి సంగీత సేవా సంస్థ వ్యవస్థాపకులు వి ప్రభాకర్ సారధ్యంలో అన్నమాచార్యుని పురస్కరించుకుని
38