ALLURI SITARAMARAJU VIGNANA KENDRAM
(Regd.No: 291/2016)
#29-13-13, Lalitha Colony, Dabagardens, Visakhapatnam-20, Cell: 9490098798.
ప్రెస్ నోట్
30:1804-25
అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో 21. 4.25 న నిర్వహించబోయే సెమినార్ యొక్క పోస్టర్ ఆవిష్కరణ
అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో 21.4,25 (సోమవారం) సాయంత్రం 5 గంటలకు “ఏ. పి.లో వైద్య ఆరోగ్య రంగాలు, ప్రభుత్వ కాలేజీల ప్రైవేటీకరణ ప్రభావాలు” అనే అంశంపై సెమినార్ నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించిన పోస్టర్ ను ఈరోజు పత్రికా విలేఖరుల సమావేశంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్స్ ఇన్చార్జి శ్రీ జి.ఎస్. రాజేశ్వరరావు, పూర్వ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీ పి. రామారావు గారు, ఆంధ్ర మెడికల్ కాలేజి పూర్వ గైనిక్ విభాగాధిపతి శ్రీ వై.యల్. నర్సింగరావు గారు, యువజన విభాగం కార్యదరి శ్రీ సంతోష్ కుమార్ గారు, మరియు డాక్టర్ అన్వేష్ గారు పాల్గొని సెమినార్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా శ్రీ జి.ఎస్. రాజేశ్వరరావు మాట్లాడుతూ, దివంగతులైన ప్రజా వైద్యులు, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులైన డాక్టర్ శ్రీ కె.హరి ప్రసాద్ స్మృత్యర్థం ఈ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో విశ్రాంత ఐఏఎస్ అధికారి మరియు ఏపీ పూర్వ హెల్త్ సెక్రటరీ అయిన డాక్టర్ శ్రీ పి.వి.రమేష్ గారు, మరియు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ శ్రీ సత్యవరప్రసాద్ గారు పాల్గొని ప్రసంగిస్తారని దీనికి ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీ ఎం. వి. రమణయ్య గారు అధ్యక్షత వహిస్తారని తెలిపారు. పూర్వ జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీ పి. రామారావు, గారు మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా వుంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, కావున ప్రభుత్వమే వైద్య ఆరోగ్య రంగాన్ని నిర్వహించాలని, కానీ దీనికి భిన్నంగా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయని, రాష్ట్రంలో నిర్మాణంలో వున్న 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పిపిపి పద్ధతిలో నిర్వహిస్తామని చెప్పడం అంటే ఇది అంతిమంగా ప్రైవేటీకరణకు దారితీసి వైద్యవిద్య ఖరీదు అయి ఎక్కువ మంది విద్యార్థులకు అందని ద్రాక్ష అవుతుందని, మెడికల్ సీట్లను కొనుక్కుని డాక్టర్లు అయినవారు. సామాజిక బాధ్యతకు తిలోదకాలిస్తారని, వైద్యం ఖరీదు అయి ప్రజలకు అందుబాటులో ఉండదని కావున వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ తో కలిసి నిర్వహించడమనే ఆలోచనను విరమించుకోవాలని తెలిపారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ గైనిక్ పూర్వ హెడ్ ఆఫ్ దిడిపార్ట్మెంట్ డాక్టర్ శ్రీ వై.ఎల్. నరసింగరావు గారు మాట్లాడుతూ దేశం యొక్క స్థూల జాతీయోత్పత్తిలో 5% శాతం వైద్య ఆరోగ్యరంగం కోసం ఖర్చు పెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిందని కానీ ప్రభుత్వాలు ఈ రంగం మీద చాలా నామమాత్రంగానే ఖర్చుపెడుతున్నాయని, దీనివలన ముఖ్యంగా పేద ప్రజలు తమ ఆరోగ్యాలు బాగు చేసుకోవడానికి తమ జేబుల్లోంచి ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వచ్చి, వారు మరింత పేదరికంలోకి జారిపోతున్నారని కావున ప్రభుత్వాలు ప్రైవేటీకరణ విధానాలు విడనాడి ప్రభుత్వమే వైద్యారోగ్య రంగాన్ని నిర్వహించాలని ఆయన కోరారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ సదస్సుకు మెడికల్ అండ్ హెల్త్ విభాగానికి చెందిన సిబ్బంది, మెడిసిన్,, నర్సింగ్ చేస్తున్న విద్యార్థినీ విద్యార్థులు, మరియు ఇతర ప్రజానీకమంతా హాజరై జయప్రదం చేయాల్సిందిగా వక్తలు కోరారు.
జి.ఎస్-రాజేశ్వరరావు
ఏఎస్వికే ప్రోగ్రామ్స్ ఇంచార్జ్