పేదలకు నాణ్యమైన విద్య అందించడం, ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం*

by vvwnews.com

*పేదలకు నాణ్యమైన విద్య అందించడం, ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం*

*రాష్ట్రంలో 3400 మంది పేదలకు ఉచితంగా డీఎస్సీ కోచింగ్ ఇస్తున్నాం*

*పి 4 ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యం*

*విశాఖ ద్వారకా నగర్ లో ఉచిత డిఎస్సీ కేంద్రాన్ని సందర్శించి అభ్యర్థులకు మెటీరియల్ పంపిణీ చేసిన మంత్రి డోలా*

*విశాఖపట్నం/ ద్వారకా నగర్ / మధురవాడ*

పేదలకు నాణ్యమైన విద్య అందించడం,ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు విశాఖపట్నంలోని
ద్వారకా నగర్ లో ఉచిత డీఎస్సీ శిక్షణా కేంద్రం మధురవాడలో కళాశాల ఎస్సి వసతి గృహాన్ని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావుతో కలిసి మంత్రి డోలా సందర్శించారు ఈ సంద ర్భంగా డీఎస్సి శిక్షణ కేంద్రం లో క్లాస్ రూమ్ లో విద్యా ర్థులతో పాటు కూర్చుని సిబ్బంది బోధనా తీరును మంత్రి పరిశీలించారు అభ్యర్థుల సమస్యలు శిక్షణ కేంద్రంలో అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసు కున్న అనంతరం అభ్యర్థుల కు ఉచిత మెటీరియల్ పంపిణీ చేశారు ఈ సంద ర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ పేద విద్యార్థు లకు నాణ్యమైన విద్య, ఉద్యోగాల కల్పనకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలో 3,400 మంది పేద విద్యార్థులకు ఉచితంగా డీఎస్సి శిక్షణ ఇస్తున్నాం రాష్ట్రం లో గురుకులాల్లో నీట్ శిక్షణ కేంద్రాలు ప్రస్తుతం మూడే ఉన్నాయి వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనతో 3 నుంచి 10 కి పెంచుతున్నాం. ఎస్సి,ఎస్టీ బ్యాక్ లాక్ పోస్టులు త్వరలో భర్తీ చేస్తాం. కూటమి ప్రభుత్వం పది నెలల కాలంలోనే రూ 300 కోట్లతో కొత్త ఎస్సి హాస్టళ్ల నిర్మాణం,గురుకులాలు, వసతి గృహాల్లో మర మ్మతులు చేయించి విద్యా ర్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం వచ్చే విద్యా సంవత్సరం నుంచి సంక్షేమ వసతి గృహాలు,గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన బియ్యంతో భోజనం పెడ తామని మంత్రి తెలిపారు రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని,అందుకోసం తెలుగువారి పర్వదినమైన ఉగాది నాడు పి4 కి శ్రీకారం చుట్టారు పి4 ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమని మంత్రి అన్నారు అనంతరం విశాఖ ఎంవిపి కాలనీలోని సాంఘిక సంక్షేమ జిల్లా కార్యా లయాన్ని తనిఖీ చేశారు ఈ సందర్భంగా కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Use Social Media to Spread the Word about Our News

related articles