మే విశాఖ జిల్లా 25వ మహాసభలు జయప్రదం చేయండిభారత కమ్యూనిస్టు పార్టీ సిపీఐ ప్రజల సమస్యల పరిష్కారం

by vvwnews.com

మే విశాఖ జిల్లా 25వ మహాసభలు జయప్రదం చేయండి
భారత కమ్యూనిస్టు పార్టీ సిపీఐ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నది. మూడు సంవత్సరాలకు ఒక్కసారి నిర్వహించే జిల్లా పార్టీ మహాసభలు మే 10, 11 తేదీలలో విశాఖ నగరం ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. 10వ తేది సాయంత్రం 4 గం॥లకు పంచరపాలెం మెట్టు నుండి ఓల్డ్ బటిల జంక్షన్ వరకు ప్రజా ప్రదర్శన అనంతరం భహిరంగ సభ నిర్వహించబడును. 11వ తేది ఉదయం 9 గం॥లకు మురళీనగర్లో గల బీస్వేర్ ఫంక్షన్ హాల్లో ప్రతినిధుల సభ జరుగుతుంది. గత మూడు సంవత్సరాల కాలంలో పార్టీ నిర్వహించిన ఉద్యమాలను సమీక్షించుకొని రాబోయే. మూడు సంవత్సరాల కాలానికి ఉద్యమ రూపకల్పన చేయడం జరుగుతుంది. పార్టీ గత మూడు సంవత్సరాల కాలంలో విశాల ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని పార్టీ పరంగాను కార్మిక సంఘాల ఐక్యవేదిక నిర్వహించే పోరాటాలలో ప్రత్యక్షంగా పాల్గొంది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇస్తామని 2019 ఎన్నికల్లో ప్రధాన మంత్రి హోదాలో విశాఖలో ప్రకటించిన ప్రధాన మంత్రి హామీ అమలు కోసం విశేషంగా కృషిచేసింది. విశాఖ నగరం చుట్టుపక్కల ఉన్న విలువైన ప్రభుత్వ భూములు కాపాడడానికి అనేక ఉద్యమాలు నిర్వహించింది. భవిష్యత్తులో కూడా పార్టీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంది.
సింహాచలం దేవస్థానం వంద గ్రామాల భూసమస్యను తక్షణమే పరిష్కరించాలని పరిశ్రమలనుండి విడుదలౌతున్న కాలుష్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాదాలని, పరిశ్రమల్లో 78% ఉద్యోగ అవకాశాలు స్థానికులకు కల్పించాలని, విశాఖ నగరంలో మంచి నీటి సమస్య పరిష్కరించాలని, విశాఖ నగరంలో గాజువాక, సత్యం జంక్షన్, మద్దిలపాలెం, హనుమంతువాక, కారుషన్ జంక్షన్ నుండి కొమ్మాది జంక్షన్లలో ఫైటవర్ల నిర్మాణం పూర్తి చేసి ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిర్ సమస్యలు పరిష్కరించాలని,
భోగాపురం విమానాశ్రయానికి సులటంగా చేరుకునే విధంగా ఎక్స్ప్రెస్ హైవే నిర్వహించాలని, త్వరితగతిన మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం కోసం కృషి చేయాలని, జల్లాలో అర్హులైన పేద ప్రజబందరికీ పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయిలు మంజూరు చేయాలని,
టిడ్కో ఇళ్ళు త్వరితగతిన పూర్తి చేసి మౌళిక సదుపాయాలు కల్పించి ఎంపిక చేసిన లబ్ది దారులకు స్వాధీనం చేయాలని, ఉత్తరాంద్ర జిల్లాల ఆరోగ్య ప్రదాయని కెజిహెదక్కు ప్రత్యేక నిధులు ఇచ్చి అభివృద్ధి చేయడంతో పాటు విమ్స్ కూడా హె నిర్వహిస్తాం. సిపిఐ చేసే ఈ పోరాటాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

Use Social Media to Spread the Word about Our News

related articles