విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ కోసం దశలవారీగా ఆందోళనలు…. ఆరు జిల్లా ప్రాంతీయ సదస్సు తీర్మానం..విశాఖపట్నం ఫిబ్రవరి 23.రాష్ట్రంలో అన్ని సౌకర్యాలు ఉన్న విశాఖపట్నంలో హైకోర్టు బెంచి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఉత్తరాంధ్ర మరియు కాకినాడ వరకూ ఆరు జిల్లాలకు చెందిన న్యాయవాదులు ఏకగ్రీవంగా తీర్మానించారు.ఆదివారం జిల్లా కోర్టు ఆవరణలోని నూతన బార్ అసోసియేషన్ సమావేశమందిరంలో
విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బెవర సత్యనారాయణ అధ్యక్షన జరిగిన సమావేశంలో శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి,అల్లూరి,కాకినాడ జిల్లాలకు చెందిన న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖపట్నంలో ప్రిన్సిపల్ హైకోర్టు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తీర్మానించారు . అడ్వకేట్ అమెండ్మెంట్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, హైకోర్టు బెంచ్ కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించారు . అంతకు ముందు జరిగిన సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బెవర సత్యనారాయణ మాట్లాడుతూ హైకోర్టు బెంచ్ కోసం చేపడుతున్న కార్యాచరణలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తామన్నారు. 1993 నుండి ఇందుకు ఉద్యమాలు నెరుతున్నామని ఇకపై పట్టు వీడేది లేదన్నారు. ఇందుకు స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసి తమ డిమాండ్ ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. ప్రతి న్యాయవాది హైకోర్టు కోసం తనవంతు సహకారం అందివ్వాలని వివిధ కేసుల మీద 700కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడకు వెళ్లడం చాలా కష్టమైన పనని అన్నారు.
బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు కృష్ణ మోహన్ మాట్లాడుతూ 1989- 90 నుండి హైకోర్టు కోసం డిమాండ్ ఉందని ఇందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు పలు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు నర్సింగరావు మాట్లాడుతూ విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు జ్యుడీషియరీ సుముఖంగా ఉందని చెప్పారు. జడ్జిలను కలిసి వాళ్ల దృష్టికి ఈ ప్రాంత డిమాండ్ తీసుకువెళితే పని సులభం అవుతుందని తెలియజేశారు. భీమిలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.వి. పార్వతీశం మట్లాడుతూ హైకోర్టు కోసం సోమవారం నుండే లాయర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలన్నారు. తుని బార్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణ శేఖర్ మాట్లాడుతూ విజయవాడ కంటే దగ్గరగా ఉన్న విశాఖపట్నం
లోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పారు.మహిళ న్యాయవాది లక్ష్మీ రాంబాబు మాట్లాడుతూ కర్నూలు కంటే అన్ని విధాలా అనుకూలమైన విశాఖనగరంలోనే హైకోర్టు బెంచ్ తో పాటు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్నారు. సీనియర్ న్యాయవాది చింతపల్లి రాంబాబు మాట్లాడుతూ హైకోర్టు బెంచ్ కోసం ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించాలని ఐక్యతతో డిమాండ్ సాధించుకోవాలన్నారు. న్యాయవాది మురళీమోహన్ మాట్లాడుతూ ల్యాండ్ ట్రిబ్యునల్ యాక్ట్ మాదిరిగానే హైకోర్టు కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలన్నారు. ఈ సదస్సులో పాలకొండ, బొబ్బిలి, రాజాం, చోడవరం,తుని, నర్సీపట్నం, అనకాపల్లి,గజపతినగరం,యలమంచిలి విజయనగరం ప్రాంతాలకు చెందిన న్యాయవాదులు పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేసారు.స్టీల్ ప్లాంట్ కార్మికుల తరహాలో హైకోర్టు కోసం ఆందోళనలు చేపట్టాలని పలువురు న్యాయవాదులు పిలుపునిచ్చారు.ఈ సదస్సులో బార్ అసోసియేషన్ కార్యదర్శి నరేష్,అహ్మద్ తదితరులు పాల్గొన్నారు
విశాఖ లో హై కోర్టు బెంచ్ పెట్టాలని బార్ కౌన్సిల్ వారు మరియు విశాఖ వాసులు తరఫునుంచి వారు కోరుచున్నారు
46