సేవ చేసే దిశగా త్రి స్టార్ క్లబ్ ముందుకు సాగుతుందని, పలువురికి ఆదర్శంగా ఉండేలా సేవలు అందించాలని త్రి స్టార్ క్లబ్ అధ్యక్షుడు, కార్యదర్శి జే. ఉమామహేశ్వర్ రావు, పి. ఎస్.సుకుమార్ లు తెలిపారు. నగరంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ త్రి స్టార్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా సభ్యులందరినీ ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రతి ఏటా ఇండస్ట్రియల్ ఎస్టేట్ పార్క్ లో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించామని గుర్తు చేశారు. తమకు సహకరిస్తున్న క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. క్లబ్ సభ్యులు అందరితో కలిసి సుమారు 250 మందికి పైగా వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ ఎస్ కిషోర్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ జే.రమేష్ కుమార్, జాయింట్ సెక్రెటరీ ఇమాన్యుయల్, ఏ ఎల్ నరసింహారావు, ఎస్ సూర్యారావు, వెంపటాపు నూకరాజు, గురూజీ, త్రీ స్టార్ క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇండస్ట్రియల్ ఎస్టేట్ త్రీ స్టార్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా వనభోజన కార్యక్రమం
46