స్వర్ణ ఆంధ్ర, స్వచ్చ ఆంధ్రా సాధిద్దాం.
– మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుదాం
– మన ఇంటి చెత్తను మనమే ఆదాయవంతంగా నిర్మూలించుదాం.
– ఎ పార్థసారథి, పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్.
స్వర్ణ ఆంధ్ర, స్వచ్చ ఆంధ్రా సాధిద్దామని గాజువాక పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ పార్థసారథి పిలుపునిచ్చారు. శనివారం ఉదయం మురళీ నగర్ లోని వైశాఖి స్పోర్ట్స్ క్లబ్ పార్క్ లో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆర్ ఇది ముకుంద ఆదేశానుసారం వనమాలి, సిటిజి, వాకర్స్ క్లబ్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒల సారధ్యంలో స్వర్ణ ఆంధ్ర, స్వచ్చ ఆంధ్రా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ తమ ఇంటిని, తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని కోరారు. ప్రతి ఒక్కరూ తమ వీధులు చెత్త, చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా అవగాహన కల్పించేందుకు కృషి చెయ్యాలి అని వివరించారు.
ఈ కార్యక్రమంలో వనమాలి, సిటిజి ప్రతినిధి మళ్ళ సరిత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద నుంచి వచ్చే వ్యర్ధాలు ఆదాయవంతంగా నిర్మూలించాలని కోరారు. తమ సభ్యులు అందరూ కూరగాయల వ్యర్ధాలు ఎరువుగా తయారు చేసుకుంటామన్నారు. మార్కెట్ కి వెళ్ళే సమయంలో గుడ్డ సంచులు తీసుకుని వెళ్తారని అన్నారు. వాడి వదిలేసే ప్లాస్టిక్ వినియోగించరాదన్నారు.
ఈ కార్యక్రమంలో ఎపిపిసిబి ప్రతినిధులు చంద్రశేఖర్, శ్యాం, వాకర్స్ క్లబ్ ప్రతినిధులు, వైశాఖి స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, గ్రీన్ వాలంటీర్లు జె రాజేశ్వరి, ఐ కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణ ఆంధ్ర, స్వచ్చ ఆంధ్రా సాధిద్దాం.- మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుదాం
45