గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం

by vvwnews.com

వైజాగ్..

గాజువాక బీజేపీ..

విశాఖ స్టీల్ ప్లాంట్ కు భారీగా ప్యాకేజీని ప్రకటించిన తర్వాత విశాఖ నగరానికి వస్తున్న కేంద్ర మంత్రి కుమార స్వామికి ఘన స్వాగతం పలికేoదుకు భాజపా ఏర్పాట్లు చేస్తోంది.ఈ మేరకు గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.అనంతరం పాత గాజువాక కూడలిలో జిల్లా అధ్యక్షుడు ఎంఎంఎన్ పరశురామరాజుతో కలిసి కెఎన్నార్ రూట్ మ్యాప్ ను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వాజపాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఉక్కును ఆదుకున్నారని,నేడు మోదీ నాయకత్వంలో ఉక్కును కష్టాల నుంచి గట్టెక్కించారని తెలిపారు.ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నప్పటికీ ప్లాంటులో పనిచేస్తున్న కార్మికుల్లో కూడా చైతన్యం రావాలని,ఉక్కును లాభాల బాటలో నడిపించేoదుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.విశాఖ విమానాశ్రయానికి చేరుకునే మంత్రి ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీగా బయలుదేరి స్టీల్ ప్లాంట్ లోకి వెళతారని తెలిపారు.

Use Social Media to Spread the Word about Our News

related articles