టిఆర్ఎస్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్

by vvwnews.com

క్లబ్బులు, ప‌బ్బులు బంద్ అయ్యాక కొంద‌రు నేత‌లు అరాచ‌కంగా తయార‌య్యార‌ని, విజ్ఞత లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని సీత‌క్క మండిప‌డ్డారు. బీఆర్ఎస్ చెప్పుడు మాట‌లు న‌మ్మ‌కుండా గ‌త పదేండ్లలో జ‌రిగిన న‌ష్టాన్ని ప్ర‌జ‌లు గ్ర‌హించాల‌ని కోరారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి..ఎంత రుణ మాఫీ జరిగిందో ఆలోచించాల‌న్నారు. అట్ట‌డుగు వ‌ర్గాల‌కు అంద‌బోయే ప్ర‌యోజ‌నాల‌ను అడ్డుకునేందుకే బీఆర్ఎస్ ఇంటింటి స‌ర్వే ను వ్య‌తిరేకిస్తుందని సీత‌క్క చెప్పారు.
ఒక్క కేసీఆర్ కుటుంభానికి త‌ప్ప ఏవ‌రికీ ల‌బ్ది జ‌ర‌గ‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే ఇంటింటి స‌ర్వేను బీఆర్ఎస్ అడ్డుకుంటుంద‌ని సీత‌క్క మండిప‌డ్డారు. ఇంటింటి సర్వే వద్దనుకుంటే ఎవరికి నష్టమో ప్ర‌జ‌లు ఆలోచించుకోవాలని మంత్రి సీత‌క్క సూచించారు.

మహారాష్ట్రలో బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు బీఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోందని ఫైర్ అయ్యారు. కేసులు నుంచి తప్పించుకునేందుకు బీజేపీకి బీ టీం గా బీఆర్ఎస్ ప‌నిచేస్తోంద‌న్నారు. మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ విడుదలైన‌ప్ప‌టి నుంచి నుంచి ప‌క్కా ప్ర‌ణాళిక‌తో బీఆర్ఎస్ విష ప్ర‌చారం చేస్తుందని మండిప‌డ్డారు. అందులో భాగంగానే పదే ప‌దే త‌ప్పుడు ప్ర‌చారం చేస్తూ ప్రజా ప్రభుత్వంపై విషం చిమ్ముతోందని పేర్కొన్నారు. అత్య‌వ‌స‌ర స‌మయాల్లో చేతిలో చిల్లి గ‌వ్వ లేకున్నా మ‌హిళ‌లు ఉచిత ప్ర‌యాణాలు చేస్తున్నారని మంత్రి సీత‌క్క గుర్తు చేసారు. ఉచిత ర‌వాణ‌ ప‌థ‌కంపై దుష్ప్రాచారం చేస్తూ..
ఆటో డ్రైవర్లను ఉసి గొల్పి ధర్నాలు చేయిస్తుంద‌ని తెలిపారు. ఓలా, ఉబ‌ర్ క్యాబ్లు, బైక్ టాక్సిల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో పచ్చా జెండాలు ఊపి ప్రారంబించిన‌ప్పుడు ఆటో డ్రైవ‌ర్లు గుర్తుకు రాలేదా అని కేటీఆర్ ను ప్ర‌శ్నించారు. కోట్లాదిమంది మహిళలకు అన్యాయం చేసేలా బీఆర్ఎస్ కుట్ర‌లుల ప‌న్నుతోందని ఫైర్ అయ్యారు.

త‌మ హయాంలో రూ. ల‌క్ష రూపాయ‌లు కూడా పంట రుణ‌మాఫీ చేయ‌ని బీఆర్ఎస్ ఇప్పుడు రైతులపై ప్రేమ కురిపించ‌డం విడ్డూరంగా ఉందని మంత్రి సీత‌క్క ఎద్దేవ చేసారు. బీఆర్ఎస్ హాయంలో 20 లక్షల మంది రైతుల‌కు పైసా రుణమాఫీ కాలేదని గుర్తు చేసారు. విడ‌త‌ల వారిగా చేసిన రుణ మాఫీ వ‌డ్డీల‌కు కూడా స‌రిపోలేదన్నారు. కానీ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం..కేవలం 27 రోజుల్లోనే 18 వేల కోట్ల పంట రుణాల‌ను మాఫీ చేసిందన్నారు మంత్రి సీత‌క్క‌. గ‌త ప్రభుత్వం రుణ మాఫీ చేయ‌క‌పోవ‌డంతో ఎంతో మంది రైతులను బ్యాంకులు బ్లాక్ లిస్టు లో చేర్చడం, ప‌లు సాంకేతిక సమస్యల కార‌ణంగా మిగిలిన రైతుల‌కు రుణ మాఫి ఆల‌స్య‌మ‌వుతోంద‌న్నారు. అయితే ఏక కాలంలో తాము పంట రుణ మాఫీ చేస్తుంటే బీఆర్ఎస్ స‌హించ‌లేక అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తుంద‌న్నారు మంత్రి సీత‌క్క‌.

తెలంగాణ లో ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్న‌ట్లు సీత‌క్క తెలిపారు. సామాన్యుల గృహాల‌కు ఉచిత విద్యుత్ ఇవ్వాల‌న్న ఆలోచ‌న బీఆర్ఎస్ చేయ‌లేదని, తాము మాత్రం 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు.
మ‌హిళలకు వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తూ.. వారిని ఆర్దిక‌తంగా బ‌లోపేతం చేస్తున్నామ‌న్నారు. మ‌హిళ‌ల‌కు బీఆర్ఎస్ ఎగ్గోట్టిన వ‌డ్డీల‌ను సైతం తాము బ్యాంకులకు చెల్లించిన‌ట్లు గుర్తు చేసారు. బీఆర్ఎస్, దాని మిత్ర‌ప‌క్షం బీజేపీలు క‌లిసి రూ. 400 ఉన్న గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ను రూ.1200 కి పెంచ‌గా..తమ ప్ర‌భుత్వం పేద‌ల‌ వంటింటి భారాన్ని తగ్గించేందుకు రూ. 500 కే సిలిండ‌ర్ అందిస్తున్నామ‌న్నారు. పదేళ్లలో లక్ష ఉద్యోగాలు సైతం బీఆర్ఎస్ ఇవ్వ‌క‌పోతే..తాము కేవ‌లం ఆరు మాసాల్లోనే 50 వేల ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలను భ‌ర్తీ చేసిన‌ట్లు మంత్రి సీత‌క్క వెల్ల‌డించారు. ఐదేల్ల కాలం కోసం ప్ర‌జ‌లు త‌మ‌ను ఎన్నుకున్నార‌ని, ఈ ఐదేల్ల‌లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామ‌ని హ‌మీ ఇచ్చారు. గూడు ఇచ్చాయ‌ని అదే త‌ర‌హాలో ఇప్పుడు కూడా రూ. 5 లక్షలతో కాంగ్రెస్ ప్ర‌జా ప్ర‌భుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తుంద‌న్నారు.

అధికారంలో ఉన్నప్పుడు అణ‌చివేత‌..విప‌క్షంలో ఉన్న‌ప్పుడు అవ‌స్త‌వాలు చెప్ప‌డ‌మే బీఆర్ఎస్ నైజమ‌ని మంత్రి సీత‌క్క ఫైర్ అయ్యారు. ఎంత ఉప్పు తింటే అంత‌ దూప అన్న‌ట్టుగా.. గ‌త ప్రభుత్వం చేసిన రూ. 7 ల‌క్ష‌ల కోట్ల అప్పుల‌కు ఇప్ప‌టికే రూ. 54 వేల కోట్లు చెల్లించాల్సి వ‌చ్చింద‌న్నారు. బీఆర్ఎస్ ఎన్నో హ‌మీలిచ్చి మోసం చేసిందని సీత‌క్క గుర్తు చేసారు. దళితున్ని సీఎం చేయ‌లేదు…ద‌ళితుల‌కు మూడెక‌ర‌లా భూమి పంపిణి చేయ‌కుండా..సోష‌ల్ మీడియా వేదిక‌గా బీఆర్ఎస్ తెలంగాణ మీద విషం చిమ్ముతోంద‌న్నారు. అసత్య ప్రచారం చేసే విప‌క్షం ఉండ‌టం తెలంగాణ దౌర్భాగ్యమ‌న్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ టిల్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని, వాస్త‌వాలు తెలుసుకోకుండా పోస్టులు పెడుతూ మాజీ మంత్రి హ‌రీష్ రావు గౌర‌వం పొగొట్టుకుంటున్నారని సీత‌క్క ఎద్దేవ చేసారు.

బీఆర్ఎస్ హ‌యాంలో తాలు, తరుగు పేరుతో రైతుల‌ను నిండా ముంచిన మిల్ల‌ర్ల ప‌ట్ల‌ తాము క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుంటే…మిల్ల‌ర్ల‌తో కుమ్మ‌క్కైన బీఆర్ఎస్ రాష్ట్రంలో అల‌జ‌డి సృష్టించే ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ని సీత‌క్క మండి ప‌డ్డారు. ధర్నా చౌక్ లు ఎత్తేసిన బీఆర్ఎస్ పెద్ద‌లు ధ‌ర్నాల‌కు దిగ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.

బీఆర్ఎస్ పాల‌న‌లో సీఎం, మంత్రులు స‌చివాల‌యానికి రాలేద‌ని..ఏనాడు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేరని సీత‌క్క గుర్తు చేసారు. కానీ తాము మాత్రం నిత్యం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నాట్లు తెలిపారు. దేశంలో సామాజిక న్యాయాన్ని, లౌకిక వాదాన్ని గెలిపించేందుకు ఇత‌ర రాష్ట్రాల్లో తాము ప్ర‌చారం చేస్తున్నామ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వ పెద్ద‌లు ప్ర‌భుత్వ సొమ్ముతో ఇత‌ర రాష్ట్రాల్లో రాజ‌కీయ పర్య‌ట‌న‌లు చేస్తే..తాము రాజ్యంగ ప‌రీర‌క్షణ కోసం, కుల గ‌ణ‌న కోసం ప‌నిచేసే శ‌క్తుల విజ‌యాన్ని కాంక్షించి సొంత ఖ‌ర్చుల‌తో తాము ప‌ర్యటిస్తున్నామ‌న్నారు. మేమేంతో మాకంత అన్న నినాదాన్నినిజం చేసేందుకు సామాజిక విప్ల‌కారుడిలా రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా చేస్తున్న పోరాటానికి మ‌ద్ద‌తుగా త‌మ ప్ర‌చారం కొన‌సాగుతుంద‌న్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles