అనకాపల్లి రైల్వే స్టేషన్ ను ఎయిర్ పోర్టు తరహాలో తయారు చేస్తామని ఎంపీ సీఎం రమేష్ అన్నారు

by vvwnews.com

*అనకాపల్లి రైల్వే స్టేషన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తాం* …
*కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి అనకాపల్లి రైల్వే స్టేషన్ న్ని మోడల్ స్టేషన్ గా తీర్చిదిద్దుతాం* …
*లక్ష్మిదేవి పేట రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తాం* …
*రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, రైల్వే స్టేషన్ అభివృద్ధికే ప్రాధాన్యం* …
*అనకాపల్లి రైల్వే స్టేషన్ పరిశీలించి,స్టేషన్ అభివృద్ధి పనులు త్వరతగతిన పూర్తిచేయాలనీ అధికారులను ఆదేశించిన-పార్లమెంటు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారు* ,రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రాక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ మరియు మాజీ శాసనసభ్యులు *పీలా గోవింద సత్యనారాయణ గారు* ….
……ఈ రోజు అనకాపల్లి రైల్వే స్టేషన్ ని పార్లమెంటు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, పార్లమెంటు సభ్యులు *సీఎం రమేష్ గారు* ,రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రాక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ మరియు మాజీ శాసనసభ్యులు *పీలా గోవింద సత్యనారాయణ గారు* పరిశీలించారు. ఈ సందర్బంగా స్టేషన్ లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను వారు పరిశీలించి, త్వరతగాతిన పూర్తి చేయాలనీ ఆదేశించారు. ఈ సందర్బంగా రైల్వే ప్రయాణికులతో, రైల్వే కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వారితో పాటు రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర గారు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వర రావు గారు,మాజీ MLC బుద్ధ నాగ జగదీష్ గారు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ గారు తదితరులు, రైల్వే అధికారులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles