2020 లో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనకు బాధితులకు అదనపు పరిహారం అందించేందుకు#vvwnews

by vvwnews.com

విశాఖ..

2020 లో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనకు బాధితులకు అదనపు పరిహారం అందించేందుకు ముందుకొచ్చిన యాజమాన్యం.

కలెక్టరేట్ లో ఎల్జీ పాలిమర్స్ పరిహారం పై ఎంపీ భరత్, కలెక్టర్ హరేందిర ప్రసాద్, ఎమ్మెల్యే గణబాబు, ఎల్ జి సంస్థ ప్రతినిధులతో భేటి.

*ఎమ్మెల్యే గణబాబు కామెంట్స్*…

ఎల్ జి పాలిమర్స్ ప్రమాదంలో పరిశ్రమ చుట్టుపక్కల ఉన్న సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోయారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత
ఎల్ జి పాలిమర్స్ బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపడుతుంది.

కొరియా ప్రతినిధులు సీఎం చంద్రబాబు నాయుడు కలవడానికి వచ్చినప్పుడు ఎల్ జి పాలిమర్స్ బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

బాధిత గ్రామాల ప్రజలు అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గత వైసిపి ప్రభుత్వం ఎల్జి పాలిమర్స్ బాధిత గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు.

ఎల్జి పాలిమర్స్ బాధిత గ్రామ ప్రజలకు విద్య, వైద్యం పాటు సురక్షిత మంచినీటిని అందిస్తాము

Use Social Media to Spread the Word about Our News

related articles