వినాయక చవితి ఉత్సవాలు సందర్బంగా పెందుర్తి మండలం జుట్టాడా గ్రామం లో NCERT Addl డైరెక్టర్ ప్రొఫెసర్ డి కే రెడ్డి మరియు సతీమణి సౌజన్య గారి ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం దిగ్విజయం గా జరుపబడినది సుమారు రెండు వేలమంది భక్తులు అన్నప్రాశాదాన్ని స్వీకరించారుముఖ్య దాత ప్రొఫెసర్ డీకేరెడ్డి గారు వారి సతీమణి తో కలిసి స్వయంగా వడ్డీంచారు ఈ కార్యక్రమం లో స్థానిక తెలుగు దేశం నాయకులు ముదునూరు కిరణ్ గారు రాజు గారు స్థానిక సర్పంచ్ సూర్య ప్రకాష్ గారు, కమిటీ కన్వీనర్ గౌరిస్ గారి ఆర్గనైజేషన్ టీమ్ సభ్యులందరు ఎంతో ఉత్సాహం తో భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యమానికి ముఖ్య అతిధి గా ఆహ్వానించబడిన ఉత్తరాంధ్ర బీసీ సంఘ కన్వీనర్ జనసేన నాయకులు శ్రీ రాజు గౌడ్ యాత గారు కమిటీ సభ్యులను అభినందిస్తు వారి గ్రామం లో నెలకొల్ప దలిచిన వినాయక గుడి విషయమై పెద్దల దృష్టికి తీసుకు వెళ్లి తగిన సహకారాన్ని అందిస్తామని యువత ఇలాంటి ఎన్నో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ తన సందేశాన్ని పంపించారు. రాష్ట్ర వెమెన్ వెల్ఫేర్ ట్రెజరర్ శ్రీమతి సౌజన్య టీమ్ సభ్యులందరికి అభినందనలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉంటే తమవంతు సహకారాన్నందిస్తామని చెప్పారు త్వరలో తలపెడుతున్న వినాయక ఆలయ నిర్మాణ వివరాలు ను అడిగి తెలుసు కున్నారు
NCERT Addl డైరెక్టర్ ప్రొఫెసర్ డి కే రెడ్డి మరియు సతీమణి సౌజన్య ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం
48