*విదేశీ క్రీడలకూ స్థానికంగా విశేష ప్రాచుర్యం*
*పికిల్ బాల్ గ్రౌండ్ ను ప్రారంభించిన గంటా*
_ఎండాడ, సెప్టెంబర్ 15:_ విదేశాల్లో ప్రాచుర్యం పొందిన పికిల్ బాల్ క్రీడను విశాఖలో ప్రారంభించడం ఆహ్వానించదగ్గ పరిణామమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎండాడలో రాడిసన్ బ్లూ ఎదురుగా అత్తిలి స్పోర్ట్స్ అకాడమి ఏర్పాటు చేసిన పికిల్ బాల్ గ్రౌండ్ ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఆధునిక ప్రపంచంలో కొత్త క్రీడలు జీవం పోసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆరేళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకూ ఆడేట్టు డిజైన్ చేసిన పికిల్ బాల్ తొందర్లోనే డిమాండ్ ఉన్న క్రీడగా మారే అవకాశముందని చెప్పారు. గంటా శ్రీనివాసరావు, జనసేన భీమిలి ఇంచార్జీ పంచకర్ల సందీప్, నిర్వాహకుడు డాక్టర్ శశి కిరణ్ కొంతసేపు పికిల్ బాల్ ఆడారు. కార్యక్రమంలో కూటమి నాయకులు సిహెచ్.గోపీ, మొల్లి లక్ష్మణరావు, నొడగల అప్పారావు, శాఖారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నోట్: ఫోటోలు ఉన్నాయి
(–###–)