ఏసీబీ కార్యాలయ సమీపంలో 12అడుగుల కొండచిలువ..పట్టుకుని అడవిలో వదిలేసిన ‘స్నేక్‌ కిరణ్‌’

by vvwnews.com

ఫోటోలున్నాయి
..
ఏసీబీ కార్యాలయ సమీపంలో 12అడుగుల కొండచిలువ
..
పట్టుకుని అడవిలో వదిలేసిన ‘స్నేక్‌ కిరణ్‌’
..
విశాఖపట్నం, సెప్టెంబర్‌ 14: విశాఖలోని ఏసీబీ కార్యాలయ సమీపంలో కొండచిలువ కలకలం సృష్టించింది. జీవీఎంసీ జోన్‌`2, 9వ వార్డు ఎండాడ`ఆదర్శనగర్‌ ప్రాంతంలో పంప్‌ హౌస్‌ ఉంది. శనివారం మధ్యాహ్నం పంప్‌ హౌస్‌ నుంచి నీటిని విడుదల చేసేందుకు అక్కడి ఇన్‌స్పెక్టర్‌ నరేష్‌ కిందకు దిగాడు. 12అడుగుల కొండచిలువ అక్కడ కనిపించడంతో బెంబేలెత్తిపోయాడు. తేరుకునేలోపే కింద పడిపోయాడు. సిబ్బంది అప్రమత్తమై నరేష్‌ను పైకి లేపి, అనంతరం కొండచిలువ సమాచారాన్ని పాములు పట్టే స్నేక్‌ కేచర్‌ కిరణ్‌కు సమాచారమిచ్చారు. కిరణ్‌ అక్కడకు చేరుకుని పామును పట్టుకుని, అనంతరం అడవిలో వదిలేశాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నగరం నడిబొడ్డున అంతపెద్ద పాము కనిపించడంతో సిబ్బంది గుండెళ్లో రైళ్లు పరిగెట్టాయి. పామును పట్టుకున్న కిరణ్‌ను అక్కడి వారంతా అభినందించారు.

Use Social Media to Spread the Word about Our News

related articles