*శ్రీశ్రీశ్రీ వరహాలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం*
*నేడు ఏకాదశి సందర్భంగా తిరు వీధి నిర్వహిస్తున్న అర్చకులు*
*సింహగిరి మాడవీధుల్లో శ్రీ గోవింద రాజు స్వామి వారు ఉభయ దేవరు లతో తిరువీధి సేవ*
*పాల్గొన ఈవో శ్రీనివాసమూర్తి భక్తజనంతో సింహగిరి*
సింహాచలం
శ్రీ స్వామి వారి సన్నిధిలో నేడు ఏకాదశి సందర్భంగా శనివారం సాయంకాలం 5:00 నుండి శ్రీ గోవిందరాజు స్వామి వారి ఉభయ దేవేరులను తిరువీధి సేవ ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో అర్చక స్వాములు వేద పండితులు నాదస్వర వేదమంత్రాలతో కోలాటాలతో అత్యంత వైభవంగా నిర్వహించారు స్వామి వారి ఉత్సవమూర్తులు గోవిందరాజ స్వామి అమ్మ వారులను ముస్తాబు చేసి వాహనంపై అధి ష్టింపజేసి సాయంత్రం సింహగిరి మాడవీధుల్లో తిరువీధి ఘనంగా నిర్వహించారు స్వామివారిని ఊరేగింపు ముందు కోలాటాల ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది స్థానాచార్యులు టిపి రాజగోపాల్ ప్రధాన పురోహితుడు గోడపర్తి శ్రీనివాసచార్యులు అర్చకులు రుత్వికులు పారాయణుకారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు