జగన్ పై కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు #vvwnews

by vvwnews.com

వరద బాధితులకు అన్ని విధాలగా అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వంపై వైసిపి అధినేత, పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే జగన్ విమర్శలు చేయడాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దుయ్యబట్టారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేయడంతో ప్రజలపై జగన్ కక్షగట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి పార్టీలు గేట్లు ఎత్తితే జగన్ తప్ప.. వైసీపీలో ఎవరు ఉండరని అన్నారు.
భీమిలో నియోజకవర్గ పరిధిలో ఉన్న మూడు మండలాల్లోని 64 పంచాయితీలను జీవీఎంసీ పరిధిలో కలిపేందుకు ప్రయత్నిస్తున్నామని అందుకు మండల నాయకుల ప్రజాభిప్రాయాలను తీసుకుని జీవీఎంసీలో కలపడం ద్వారా విశాఖ పట్టణీకరణ మరింత పెరిగి అభివృద్ధికి సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి జనసేన ఇంచార్జ్ సందీప్ పంచకర్ల, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles