ఎస్సీ వర్గీకరణ అంశంమీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై విశాఖపట్నం డాక్టర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ వేసిన రివ్యూ పిటిషన్ ను సుప్రీం కోర్ట్ ఆమోదించిన నేపథ్యంలో తీర్పు వచ్చేంతవరకు వేచిచూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి డాక్టర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ అధ్యక్షుడు బయ్యే మల్లయ్య విజ్ఞప్తి చేసారు.గురువారం విశాఖపట్నం పౌరగ్రంధాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ సుప్రీం కోర్ట్ లాయర్ దిశా వడేకర్ నేతృత్వంలో డాక్టర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ వేసిన రివ్యూ పిటిషన్ కు ఈ నెల పదోతేదీన డైరీ నెంబర్ 41717 కేటాయించిందని తెలిపారు.రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు పునఃపరిశీలించాలని, న్యాయపరంగా అన్ని విషయాలను సమగ్రంగా పరిశీలించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని సుప్రీం కోర్ట్ కు విన్నవించుకున్నామని తెలిపారు. సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు కు వ్యతిరేకంగా ఆగష్టు 21 న తాము చేపట్టిన భారత్ బంద్ విజయవంతమయిందని తెలిపారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం,జనసేన,బీజేపీ కూటమికి మద్దతుగా నలభై శాతం మాలలు ఓటువేసి కూటమి విజయానికి కారకులయ్యారని తెలిపారు.ముందుగా ఎస్సీ లలో ఉన్న కులాలలో కులగణన చేపట్టాలని మల్లయ్య ప్రభుత్వాన్ని కోరారు.విద్య,వైద్యం,ఉపాధి రంగాల్లో వెనుకబడి ఉన్న మాలలకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేసారు.మీడియా సమావేశంలో డాక్టర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ ప్రధాన కార్యదర్శి దాకే సువర్ణ రత్నం,ఉపాధ్యక్షుడు దాసరి పుల్లారావు, కార్యదర్శి ఎస్ మోహన్ బాబు,సిటీ కన్వీనర్ బొత్స రామసూర్య,అనకాపల్లి జిల్లా కన్వీనర్ ఎం ఏ రాజు,కో కన్వీనర్ రేబాక మధు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణ అంశంమీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై #vvwnews #visakhaupdates
46