క్వారీ రీచ్ లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు…#vvwnews

by vvwnews.com

విశాఖ జిల్లాలోలో క్వారీ రీచ్ లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేలాలని విశాఖ జిల్లా క్వారి లారీ యజమానులు సంఘం కార్యదర్శి కర్రి వెంకట రమణ కోరారు. వైజాగ్ జర్నలిస్టు ఫోరంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో క్వారీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి లారీలతో ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తున్నమని గుర్తు చేశారు. అలాగే ఇసుక రవాణా చేస్తూ, పదివేల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నారు అని తెలిపారు. కానీ గత ఐదు నెలల నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లాలో గాని, అటు రాజమండ్రి జిల్లాలో గాని ఇసుక రీచ్ లు అవ్వకపోవడం వల్ల తమ లారీలకు ఫైనాన్స్ కట్టలేక డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేక చాలా ఇబ్బంది పడుతున్నాం అని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో నివసిస్తున్న లారీ యజమానులు పడుతున్న ఇబ్బందుల కోసం వారి బాధలను ప్రభుత్వం అర్థం చేసుకుని సమస్య పరిష్కారం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బొట్టా సురేష్, కొయ్య శ్రీను, సంయుక్త కార్యదర్శులు శ్రీనివాస రావు, భాస్కర రావు, విశాఖ పట్నం లారీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి కె.అర్జున్ రావు, శ్రీ సింహాద్రి లారి ఒనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బంక శ్రీను, కార్యదర్శి కోరాడ శ్రీను, కోశాధి దికారి రెడ్డి శ్రీరాములు మణికంఠ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బీ.రాంబాబు, కార్యదర్శి ఎస్. జగ్గా రావు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles