ప్రెస్ నోట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పెంచిన డీజిల్ పెట్రోలు వంట గ్యాస్ బియ్యము పప్పులు వంటనూనె విద్యుత్తు నిత్యవసర వస్తువుల ధరలు రద్దు చేయాలని సిపిఐ నేత జి వామనమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం భారీగా పెంచిన డీజిల్ పెట్రోల్ నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించి ప్రజలకు ఆహార భద్రత కల్పించాలని అని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుండి 6 వరకు ప్రజా ఆందోళన చేపట్టాలని ఇచ్చిన పిలుపులో భాగంగా తేదీ 4 9 2024 మధ్యాహ్నం 12 గంటలకి శ్రీ విజయ దుర్గ ఆటో వానర్ కమ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఇన్ గేట్ వద్ద గోడ పత్రిక ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జె రాజారెడ్డి సిపిఐ విశాఖ నగర నాయకులు జి వామన మూర్తి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో డీజిల్ పెట్రోలు వంటగ్యాసు నిత్యవసర వస్తువుల ధరలు తగ్గిస్తామని సంవత్సరానికి రెండు కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికి తీసి దేశంలో ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారులు వచ్చే పదేళ్లు దాటిన ధరలు తగ్గించలేసరి కదా మరింత భారీగా పెంచారని మండిపడ్డారు డీజిల్ పెట్రోలు నిత్యవసర వస్తువుల ధరలు పెంచి పేదల ప్రజలు కడుపులు కొడుతున్నారని విమర్శించారు ప్రజాధనాన్ని బడా కార్పొరేట్ సంస్థలైన అంబానీకి అదాని రిలయన్స్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తూ దేశ ప్రజలపై ఆర్థిక భారాలు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పెంచిన ధరలు వెంటనే తగ్గించి కార్మికులకు ప్రజలకు ఆహార భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో ప్రజా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్యక్రమంలో రాజేష్ నాగరాజు ఆంజనేయులు వై వెంకట్ రావికృష్ణ హెచ్ శేఖర్ జై గణేష్ కుమార్ శ్రీను అప్పలరాజు గంగరాజు తదితరులు పాల్గొన్నారు ఇట్లు జి వామనమూర్తి
నిత్యవసర వస్తువుల ధరలు రద్దు చేయాలని సిపిఐ నేత జి వామనమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ #vvwnews
55