*ములుగులో 500 ఎకరాల్లో చెట్లు నెలకొరగడంపై మంత్రి సీతక్క ఆరా*
రాష్ట్ర సచివాలయం నుంచి పీసీసీఎఫ్, డీ ఎఫ్ ఓలతో టెలిఫోన్లో మాట్లాడిన మంత్రి సీతక్క
రెండు రోజుల క్రితమే చెట్లు నెలకొరిగిన ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి సీతక్క
లక్ష చెట్ల వరకు నెలకూలడం పట్ల మంత్రి విస్మయం
ఈ స్థాయిలో అటవి విద్వంసం జరగడం పట్ల ఆశ్చర్యం
*సీతక్క*
ములుగు అడవుల్లో సుడిగాలి వల్ల లక్ష చెట్ల వరకు నెలకొరిగాయి
వందల ఎకరాల్లో నష్టం వాటిల్లింది
వృక్షాలు కూలడంపై విచారణకు ఆదేశించాము
డ్రోన్ కెమెరాల సహాయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేశాం
నేడు ఘటన ప్రాంతాన్ని సందర్శించి పిసిసిఎఫ్ నివేదిక సిద్ధం చేస్తారు
అడవిలో సుడిగాలి వచ్చింది కాబట్టి ప్రాణనష్టం జరగలేదు
ఈ సుడిగాలి గ్రామాల్లో సంభవించి ఉంటే పెను విధ్వంసం జరిగేది
సమక్క సారలమ్మ తల్లుల దయ వల్లే సుడిగాలి ఊర్ల మీదకు మల్లలేదు
తల్లుల దీవేనతోనే ప్రజలకు సురక్షితంగా బయటపడగలిగారు
చెట్లు నెలకూలడంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
కేంద్రం నుంచి పరిశోధన జరిపించి కారణాలు గుర్తించాలి
కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి
అటవి ప్రాంతంలో చెట్లను పెంచేలా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి