పర్యావరణ హితంగా జీవించుదాం.- మట్టితో చేసిన గణపతిని పూజించాలి #vvwnews #latestnews

by vvwnews.com

పర్యావరణ హితంగా జీవించుదాం.
– మట్టితో చేసిన గణపతిని పూజించాలి
– ఎకో వైజాగ్ ను విజయవంతం చేద్దాం
– జలవనరుల పరిరక్షణకు కృషి చేద్దాం.
– జెవి రత్నం. వ్యవస్థాపక కార్యదర్శి. గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ
పర్యావరణ హితంగా జీవించుదాం, మట్టితో చేసిన గణపతిని పూజించుదాం అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం. మంగళవారం ఉదయం ఆళ్వార్ దాస్ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ లోని ఎన్ విపి లా కాలేజీ, సిమ్స్, సిఎం టి విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలు తయారు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. జి విఎంసి కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశానుసారం నగరంలోని 30 విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలు విద్యార్థులతో తయారు చేసిన అనంతరం అవగాహన కల్పించామన్నారు. రాబోయే వినాయక చవితికి మట్టి గణపతి బొమ్మ లు పూజించుదాం అని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్లాస్టిక్ తో ను, రసాయనాలతో, భారీ లోహాల రంగులతో ఉన్న గణపతి బొమ్మలు వాడకం హానికరమని, మన వాతావరణాన్ని కలుషితం చేస్తాయని పేర్కొన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని మట్టి తో ఉన్న గణపతి బొమ్మలు పూజించాలని హితవు పలికారు. జలవనరులను కాపాడుకోవాలి అని కోరారు.
ఈ అవగాహన కార్యక్రమంలో ఆళ్వార్ దాస్ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపికా దాస్, ఎన్ వి పి కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ అలోక్ చంద్రుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ రూపం,‌సిఎంటి బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ అర్చన, ఎస్ ఐ ఎం ఎస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లారెన్స్, డైరెక్టర్ డాక్టర్ సాయిప్రసాంత్ తదితరులు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ కోఆర్డినేటర్లు జెనపరెడ్డి రవితేజ, ఐ కృష్ణ కుమారి, జి ఎన్ మురళి తదితరులు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles