3rd day report
విశాఖ మ్యూజికల్ డాన్స్ అకాడమీ కళాభారతి నిర్వహిస్తున్న ఆరు రోజుల జాతీయ పురస్కార సంగీత, నృత్య, నాటక వార్షిక ఉత్సవాల్లో 3వ రోజు ఈ రోజున శ్రీ మ్. మురళి మోహన్ రాజు,, చీఫ్ of స్టాఫ్ ఆఫీసర్, (పర్సనల్ & అడ్మినిస్ట్రేషన్ ) ఈస్టరన్ నేవల్ కమాండర్, విశాఖపట్నం వారు ముఖ్య అతిథిగా విచ్చేసి అధ్యక్షులు మంతెన సత్యనారాయణ రాజు, కార్యదర్శి డాక్టర్ గుమ్ములూరి రాంబాబు, ట్రెజరర్ శ్రీ పైడా కృష్ణ ప్రసాద్, DR. విజయకుమార్ నేటి ఈలపాట కళాకారుడు Dr. కే. శివ ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి శుభారంభం చేశారు.
తరువాత జరిగిన ఈల పాట కచేరిలో, విశ్వ విఖ్యత కర్ణాటక ఈల పాట కళాకారుడు Dr. కే. శివప్రసాద్ వారి బృందంతో కచేరి అద్భుతంగా చేసేరు.
మామ్మూలుగా ఎవరైనా ఊపిరి ఒక్క 30 సెకండ్స్ బిగపట్టడమే చాలా కష్టం.
అలాంటిది కష్టమైన రాగాలాపన, స్వరకల్పనలతో ఈల పాట 2 గంటాలు పాటు కచేరి చేసి అందర్నీ ఆశ్చర్య పరిచి ప్రేక్షకుల కరతాల ధ్వనులతో హాలు మారు మ్రాగి పోయింది..
2 గంటలు కచేరి అప్పుడే అయిపోయిందా అనిపించి ప్రేక్షకులు ఇంకా పాడమనడంతో కచేరి స్థాయి ఎంత గొప్పగా వుందో తెలుకో వచ్చు.
మెయిన్ ఐటమగా నగుమోము.. అభేరి రాగం త్యాగరాజ కీర్తన,అది తాళం అమోఘం. ఎంతో కష్టమైన స్వరాలు, రాగాలాపన, తార మందర స్థాయిలలో అవలీలగా పాడి అందరిని ఆశ్చర్య పరిచేరు.
మొదటి కీర్తన
[26/08, 15:36] Sivaprasad Eelapata: 1.తోడి రాగం వర్ణం
2.వాతాపిగణ పత్తింభజేహం.. ముత్తుస్వామి దీక్షితర్.. కీర్తన
3.గానమూర్తె రాగం- గానమూర్తె – త్యాగరాజ కీర్తన,
4.దొరకునా ఎటువంటి సేవా… బిలహరి రాగం
5.బంటురీతి కోలువియ్యవయ్య రామ.. త్యాగరాజ హంసనాదం రాగం
6.స్వాగతం కృష్ణా.. మోహన రాగం.. ఊతుకాడు వెంకటసుబ్బయ్య రచన
7.మరకత మణిమయ చేలా..
ఆరభి రాగం.. ఊతుక్కాడు వెంకటసుబ్బయ్య రచన
8)బృందావన సారంగి -రాగం.- తిల్లాన బాలమురళీకృష్ణ రచన..
9):సర్వం బ్రహ్మమయం… మధువంతి రాగం…. సదాశివ బ్రహ్మేంద్ర రచన
10)నగుమోము.. అభేరి రాగం త్యాగరాజ మెయిన్ అది తాళం
ఒక్కొక్క కీర్తన కి ప్రేక్షకులు వారు ఆనందాశ్చారాలను చప్పట్లతో వ్యక్తపరచడంతో కళాకారులు మరింత ఉత్సాహంతోకచేరి కొనసాగించేరు.
వైయలిన్ పై విద్వాన్ మావుడూరి సత్యనారాయణ శర్మ, మృదంగం పై..శ్రీ రామకృష్ణ,
తబలాపై శ్రీ గుణరంజన్, కీ బోర్డు పై శ్రీ లాల్ కృష్ణ,
మోర్సింగ్ పై విద్వాన్ వెంకటేష్ సహకారం అందించి కచేరి స్థాయిని పెంచేరు.
శ్రీ పిల్లా రమణ మూర్తి వ్యాఖ్యతగా వ్యవహరించేరు.
కృష్ణష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని బాగా అలంకరించి వైదికంగా పూజ చేసి హారతి ఇవ్వడం jarigindi
చివరిగా కార్యదర్శి Dr. రాంబాబు గుమ్ములూరి మాట్లాడుతూ రేపటి కార్యక్రమం వివరాలు తెలియజేసేరు.
విద్వాన్ O. S. అరుణ్, ప్రశఖ్యాత గాత్ర విద్వాంసుడు, భజన సాంప్రదాయం లో నిష్ణాతులు. అందరూ వచ్చింది ఆనందించి విజయవంతం చేయాలని కోరారు.