AITUC జాతీయ సమావేశాలు సెప్టెంబర్ ఒకటి రెండు మూడో తేదీ స్టీల్ ప్లాంట్ దగ్గర జరుగుతాయి

by vvwnews.com

ప్రెస్ నోట్ ఇసుక సిమెంటు ఐరన్ ధరలు తగ్గించి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలి జి వామనమూర్తి డిమాండ్ ప్రభుత్వం ఇసుక సిమెంట్ ఐరన్ ధరలు తగ్గించి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని సెప్టెంబర్ మూడు తేదీన విశాఖలో జరుగు కార్మిక ప్రదర్శన బహిరంగ సభలను జయప్రదం చేయాలని కోరుతూ తేదీ 26 824 9 గంటలకి సీతమ్మధార అల్లూరి సీతారామరాజు జంక్షన్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి స్థానిక సంఘ నాయకులు రావికృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను వెంటనే ఆపాలని ఇసుక సిమెంట్ ఐరన్ ధరలు తగ్గించి భవన నిర్మాణ కార్మిక ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పాలకులు ఉచితల పేరుతో కార్మికులను రోజుల తరబడి ఉపాధి లేకుండా చేస్తున్నాయని మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం భావన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి కార్మికుల కుటుంబాలు ఆదుకోవాలని కోరారు లేనిపక్షంలో దశలమేర ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు సెప్టెంబర్ మూడున విశాఖ నగరంలో ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో జరిగే కార్మిక ప్రదర్శన బహిరంగ సభలో కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని పిలుపునిచ్చారు కార్మిక ఉద్యోగ ప్రజా హక్కుల సాధనకై పోరాడాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు ఈ ధర్నాలో కే శంకర్ ఎస్ పాపారావు పి గణపతి జి సత్యం డి రాము కవిత్రాజు బి రాజు తదితరులు పాల్గొన్నారు ఇట్లు జి వామనమూర్తి

Use Social Media to Spread the Word about Our News

related articles