కలకత్తా జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారం చేసిన వారిని కఠినముగా శిక్షించాలి CITU విశాఖ జిల్లా

by vvwnews.com

*ప్రెస్‌ నోట్‌ (జివిఎంసి)*
*మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు రాజీనామా చేయాలి.*
*-విశాఖలో సిఐటియు ప్రదర్శన, మానవహారం*
కలకత్తాలో ఆగష్టు 9న జూనియర్‌ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్యతో దేశంలో వివిధ ప్రాంతాల్లో స్త్రీలపై జరుగుతున్న దాడులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మహిళలకు రక్షణ కల్పించే చట్టాలున్నా వాటిని పటిష్టంగా అమలు చేయలేని ప్రభుత్వాలు తక్షణమే రాజీనామా చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌ డిమాండ్‌ చేసారు. బుధవారం జివిఎంసి గాంధీవిగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మానవహారం అనంతరం జివిఎంసి గాంధీవిగ్రహం నుండి ఆశీలమెట్ట, లలితాజ్యూయలర్‌ మీదుగా గురజాడ విగ్రహం, సెంట్రల్‌ పార్కు నుండి తిరిగి జివిఎంవి గాంధీవిగ్రహంకు ప్రదర్శన చేపట్టారు.
ఈ సందర్భంగా శ్రామికమహిళా జిల్లా కన్వీనర్‌ పి.మణి మాట్లాడుతూ కలకత్తాలో జరిగిన జూనియర్‌ వైద్యురాలపై చేసిన సామూహిక అత్యాచారం, హత్య వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందని, అందుకే కేసు రోజుకో మలుపు తిరుగుతోందన్నారు. సుప్రీంకోర్టు స్పందించిన కేంద్ర బిజెపి ప్రభుత్వం, బెంగాల్‌ మమతా బెనర్జీ ప్రభుత్వాలు మాత్రం మౌనంగా వుంటున్నాయన్నారు. దేశంలో ఒక్క బెంగాలే కాకుండా అనేక ప్రాంతాల్లో 3ఏళ్ళ చంటి పాప దగ్గర నుండి 90 ముసలమ్మ వరకు కామందులు వదలకుండా అత్యాచారాలు చేస్తున్నారన్నారు. భారతదేశంలో స్త్రీలకు గౌరవం, స్వేచ్ఛ, సమానత్వం ఎక్కడుందని ప్రశ్నించారు. మహిళలకు రక్షణ కల్పించే చట్టాలు పటిష్టంగా అమలు జరిపేవరకు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. దేశవ్యాప్తంగా సిఐటియు అత్యాచారాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతోందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి మేరి, అంగన్‌వాడీ అధ్యక్షులు వెంకటలక్షి, ఆర్‌పి నాయకులు, సిఐటియు నాయకులు ఎ.సీతాలక్ష్మి, ఎం.సుబ్బారావు, కుమారి, చంద్రమౌళి, శివ, రాజు, పి.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌
ప్రధాన కార్యదర్శి

Use Social Media to Spread the Word about Our News

related articles