వృక్షాబంధన్ తో మహావృక్షాల పరిరక్షణ
సాధ్యం
– బి శ్యామల. ఎఫ్ఆర్ఒ. విఎంఆర్ డిఎ
వృక్షాబంధన్ తో మహా వృక్షాల పరిరక్షణ
సాధ్యం అని విఎంఆర్ డిఎ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బి శ్యామల అన్నారు . సోమవారం ఉదయం గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ నేతృత్వంలో విశాఖపట్నం లోని సెంట్రల్ పార్క్ వద్ద , ఎస్ వివి పి డిగ్రీ కళాశాల, ఎఎస్ రాజా వుమెన్స్ జూనియర్ కళాశాలలో వృక్షాబందన్ మహోత్సవం నిర్వహించారు. సెంట్రల్ పార్క్ వద్ద మహా వృక్షానికి రాఖీ కట్టిన తరువాత శ్యామల మాట్లాడారు. అతిపెద్ద వృక్షాలకు రాఖీ లు కట్టి రేపటి తరాలకు వారసత్వ సంపద గా గుర్తించి కాపాడుకునెలా చేయాలని ఆమె కోరారు. మహా వృక్షాలన్ని మన జాతి సంపద గా గుర్తించి కాపాడుకోవాలనె ఉద్దేశంతో ప్రతి ఒక్కరినీ చైతన్య పరచడానికి తాము గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ తో కలిసి వృక్షాబందన్ దినోత్సవం నిర్వహించామన్నారు.
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె.శివాని మాట్లాడుతూ మహా వృక్షాలను కాపాడడం మన బాధ్యత అన్నారు. అవి జీవరాశి మనుగడకు కీలకం అని వివరించారు. మనకు ప్రాణవాయువు ఇచ్చే చెట్లను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలి అన్నారు.
ఎస్ వి వి పి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ మహా వృక్షాలను కాపాడడం మానవాళి బాధ్యత అని అన్నారు. అర్జున వృక్షానికి రాఖీ కట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి వృక్ష సంపద ను కాపాడు కోవాలని పిలుపునిచ్చారు.
ఎఎస్ రాజా వుమెన్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం కాసు మామిడి చెట్టు కు రాఖీ కట్టిన అనంతరం మాట్లాడారు. ప్రతి విత్తనం మొక్కగా మొలకెత్తేందుకు విద్యార్థులు కృషి చెయ్యాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు నిరంతరం కృషి చెయ్యాలి అని కోరారు.
ఈ కార్యక్రమంలో జివిఎంసి సస్టైనబుల్ రిజిలియన్స్ యూనిట్ ప్రతినిధులు శశికళ, ప్రమీల, దివ్య, మంగరాజు, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం , వాలంటీర్లు జె. రవితేజ, ఐ. కృష్ణకుమారి వ్యూస్ ఎన్ జి ఒ కో ఆర్డినేటర్ జె.రాజేశ్వరి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ అప్పారావు, సుశీల, స్వాతి తదితరులు పాల్గొన్నారు