VEERU MAMA’S 3rd series VIZAG SCHOOL 🎒🏫 CHAMPIONS 🏆🏆

by vvwnews.com

విద్యార్థుల్లో భావ వ్యక్తీకరణ, సృజనాత్మకత చాలా ముఖ్యం!
విశాఖపట్నం, ఆగస్టు 17.
విద్యార్థుల్లో చిన్నతనం నుంచే భావ వ్యక్తీకరణ, సృజనాత్మకత చాలా ముఖ్యమని ది బ్రాండ్ ఐకాన్ ఫర్ గ్లోబల్ ఈవెంట్స్ అధినేత వీరూ మామ పేర్కొన్నారు. వైజాగ్ స్కూల్ ఛాంపియన్స్ అండ్ వైజాగ్ మెగా డ్యాన్స్ కాంటెస్ట్ ప్రిలిమ్స్ పోటీలు జరగనున్న నేపథ్యంలో ఎంవిపి కాలని ఇసుకతోట డబల్ రోడ్డు మ్యూజిగల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో చదువుతో పాటు భావ వ్యక్తీకరణకు, సృజనాత్మకతకు తల్లిదండ్రులు కృషి చేస్తే అవి వారి సంపూర్ణ మానసిక వికాసానికి తోడ్పడతా యన్నారు. ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అండ్ రెసొ వైజాగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సహకారంతో మెగా డ్యాన్స్ ఈవెంట్లు నిర్వహిస్తా మన్నారు. క్రియేటివ్ డ్రెస్, టాప్ స్పీకర్, రైమ్స్ పోటీలు, సింగింగ్ సూపర్ కిడ్, వెస్టర్న్ డ్యాన్స్, డ్రాయింగ్ కాంటెస్ట్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తా మన్నారు. వీటికి సంబంధించిన ఆడిషన్స్ నేడు, రేపు ఎంవిపి కాలని ఇసుకతోట డబల్ రోడ్, ఆక్సిస్ బ్యాంక్ ఎదురుగా ఉన్న మ్యుూజిగల్లో జరుగుతాయన్నారు. మెగా ఫైనల్ సెప్టెంబర్ ఒకటో తేదీ పోర్ట్ స్టేడియం లోని విశ్వనాథ్ కన్వెన్షన్ లో జరుగుతా యన్నారు. వీటిలో విజేతలకు ఒక లక్ష రూపాయలు బహుమతులుగా అందచేస్తా మన్నారు. ఆసక్తి గల వారు 7207340513, 7013785330 నంబర్లలో తమను సంప్రదించా లన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో మ్యూజిగల్ అధినేత రవికుమార్, ఈవెంట్ ఆర్గనైజర్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles