డాక్టర్ చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ & చారిటబుల్ సేవా ట్రస్ట్ డాక్టర్ ఫైల్ స్టేషన్ ప్రోగ్రాం 20 24

by vvwnews.com

ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందుకున్న చెన్నా ప్రమోదిని

విశాఖ సిటీ: పలువురు పేదలకు సమాజ సేవలు అందిస్తూ… మరో వైపు పలు న్యాయ సంబంధిత లీగల్ ఆర్టికల్స్ ను వ్రాసి వివిధ పత్రికలు ద్వారా ప్రజలకు ఉచిత న్యాయ విజ్ఞాన అవగాహనలను అందిస్తున్న నగరానికి చెందిన ఉచిత లీగల్ అవేర్నెస్ పర్సన్ , సమాజ సేవకురాలు చెన్నా ప్రమోదినికు అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. విశాఖ పబ్లిక్ లైబ్రరీలో దోమన చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ సంస్థ పర్యవేక్షణలో ఈ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించారు. పలు రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వారిని గుర్తించి యూనివర్సిటీకి సిఫారసు చేస్తున్నట్లు డాక్టర్. దోమన చిన్నారావు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కేజిహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్. అర్జున, జీవీఎంసీ జోనల్ కమిషనర్ ఆర్. జి.వి.కృష్ణ, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, కార్పొరేటర్ గుండపు నాగేశ్వరావు తదితరుల చేతులమీదుగా చెన్నా ప్రమోదిని ఈ గౌరవ డాక్టరేట్ అందుకుంది. అనంతరం డాక్టర్. చెన్నా ప్రమోదిని మాట్లాడుతూ… తాను చిన్నతనం నుంచి పేదలకు వివిధ సందర్భాల్లో అన్నదానం, వస్త్ర దానం, ఆర్థిక సహాయాలను అందిస్తున్నానన్నారు. తాను చదువుకున్న న్యాయ విద్య ప్రయోజనాలు అందరికీ అందాలనే ఉద్దేశంతో, వివిధ లీగల్ ఆర్టికల్స్ వ్రాస్తూ..చట్టాలపై అందరికీ అవగాహన కల్పించి అందరిలో ఒక ధైర్యాన్ని నింపి సమాజంలో మోసాల బారిన పడకుండా ఉండేందుకు కృషి చేస్తున్నానన్నారు. ఈ గౌరవ డాక్టరేట్ తో తనలో నూతన ఉత్తేజం వచ్చిందని, తన సేవలు మరింత విస్తృతం చేస్తానని డాక్టర్. చెన్నా ప్రమోధిని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన ప్రముఖులు, అవార్డ్ గ్రహీతలు తదితరులు పాల్గొని పేదలకు సామాజిక సేవలు, ప్రజలకు లీగల్ అవేర్నెస్ కల్పిస్తూ చిన్న వయసులోనే గౌరవ డాక్టరేట్ సాధించిన డాక్టర్. చెన్నా ప్రమోదినిను ఘనంగా అభినందించారు.

Use Social Media to Spread the Word about Our News

related articles