విశాఖలో ప్రభుత్వ భూములు కాపాడండి…**అక్రమ భూ కేటాయింపులు రద్దు చేయండి ..*

by vvwnews.com

*విశాఖలో ప్రభుత్వ భూములు కాపాడండి…*
*అక్రమ భూ కేటాయింపులు రద్దు చేయండి ..*
*అసైన్డ్ భూములు ఇన్సైడ్ ట్రేడింగ్ పై క్రిమినల్ కేసులు పెట్టండి…*
*ఫ్రీ హోల్డ్ అసైన్డ్ భూములు ఎస్సీలు ఎస్సీలకే అమ్మేళా జీ ఓ సవరించండి ….*
*ప్రత్యేక కార్యదర్శి సిసోడియా కు విదసం పిర్యాదు….*

దశపల్లా భూములను , శారదా
పీఠం భూములను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకుని 22a నిషేధిత జాబితాలో పెట్టాలని, అసైన్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు చేసి ఎస్సీ భూములు ఎసిలకే అమ్మేటట్టు జీ వో సవరించాలని విశాఖ లో భుకుంబకోణాల పై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని , బీచ్ రోడ్ లో ఎక్స్ సర్వీస్ మెన్ కి కేటాయించిన 5 ఎకరాల కమర్షియల్ భూమిని రద్దు చేయాలని, రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామ్ ప్రకాష్ సిసోడియా కు విదసo ఐక్య వేదిక ఫిర్యాదు చేసింది ..
ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న డిసోడియా ను ఈ రోజు పోర్టు గెస్ట్ హౌస్ లో విదసo ( విస్తృత దళిత సంఘాల) ఐక్య వేదిక ప్రతినిధులు పలు భూ సమస్యలపై పిర్యాదులు అందజేశారు …
ఈ సందర్భంగా సంఘ కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు మాట్లాడుతూ విశాఖ, విజయ నగరం జిల్లాల్లో 10 వేల ఎకరాలకు పైగా అసైన్డ్ భూములు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందన్నారు . జీ ఓ రాక ముందే వైసీపీ పెద్దలు, కొందరు అధికారులు అసైన్డ్ రైతులను మోసగించి ఎకరా కోట్ల రూపాయల విలువైన భూములు 5,10 లక్షలకే కాజేసారని దేనిపై హైకోర్టు సిటింగ్ న్యాయమూర్తి చే విచారణ జరిపించాలన్నారు .. ఇన్సైడ్ ట్రేడింగ్ కి పాల్పడిన డోసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
భీమిలి బీచ్ రోడ్ లో స్వరూపానంద కు కేటాయించిన 15 ఎకరాలు భూములు తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పిర్యాదు చేశామన్నారు.
విశాఖ నడిబొడ్డున నిషేధిత జాబితా లో ఉన్న దసపల్లా భూములు వైసీపీ పెద్దలకు అనుకూలంగా గత కలెక్టరు 22 a నుండి తప్పించారు అని, ఈ భూములు పక్కనే సర్క్యూట్ హౌస్ కి కుడి పక్కన లైఫ్ స్టైల్ పక్కన ఉన్న 5 వేల కోట్లు విలువైన 5 ఎకరాలు కూడా గత కలెక్టరు ఫ్రీ హోల్డ్ చేసారనీ ఈ భూములు కూడా తిరిగి నిషేధిత జాబితా లో పెట్టీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని దిమాండు చేశారు, బేచ్ రొడ్ మూన్ లైట్ అపార్ట్మెంట్ పక్కన ఉన్న 5 ఎకరాలు భూమిని నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్స్ సర్వీస్ మెన్ కి కేటాయించారని ఎక్స్ సర్వీస్ మెన్ కి వ్యవసాయ భూమిని మాత్రమే ఇవ్వాల్సి ఉండగా ఏకంగా కమర్షియల్ భూమిని కేటాయించడంలో ఎన్ని వందల కోట్లు కుంభకోణం దాగి ఉందని ప్రశ్నించారు …
అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1/70 కి విరుద్ధంగా జీప్ లైన్ కి కేటాయించిన భూములు వెనక్కి తీసుకుని ఆ భూములు ఆదివాసీ నిరుద్యోగులకు కేటాయించి టూరిజం ప్రాజెక్టు నిర్వహించాలని కోరామని తెలిపారు…
దేనిపై సిసోడియా స్పందిస్తూ…

ఈ కార్యక్రమంలో జాజీ ఓంకార్, సోడా దాసి సుధాకర్, బొడ పాటి శామ్యూల్ కుమార్, బల్ల కుమార్, తాటిక రవి శేఖర్, అలమండ మంగ రాజు, ములం పాక అఖిల్, కస్తూరి వెంకట రావు తదితరులు పాల్గొన్నారు…

Use Social Media to Spread the Word about Our News

related articles