బంజారాలతో నృత్యం చేసిన మంత్రివర్యులు సీతక్క మన ఆచార్య సంప్రదాయాలు కాపాడుకోవాలి

by vvwnews.com

– బంజారాలతో నృత్యం చేసిన మంత్రి వర్యులు సీతక్క గారు

– మన ఆచార సంప్రదాయాలు కాపాడుకోవాలి

– నూతనంగా నిర్మించిన మెరమ్మా యాడి గుడిని ప్రారంభించిన మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క

– ఎన్నికల సమయములో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తా

– పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సీతక్క

తేది 15.08.2024
రామచంద్ర పూర్

ఈ రోజు ములుగు మండలం లోని రామచంద్ర పూర్ మరియు ముద్దునూరు తండా గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు
రామచంద్ర పూర్ గ్రామములో NRGS నిధుల నుండి 3 కీలో మీటర్ల తో చేపట్టిన గ్రావెల్ రోడ్డు పనులను అదే విధంగా ఆంజనేయ స్వామి గుడి కాంపౌండ్ వాల్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు
అనంతరం ముద్దునూరు తండా లో నూతనంగా నిర్మించిన మేరామ్మ యాడి గుడి లో ప్రత్యేక పూజలు చేశారు గుడి చుట్టూ ప్రహరీ గోడ కు నిధులతో పాటు గ్రామ ప్రజల కోరిక మేరకు త్రాగు నీటి ఇబ్బందులు పడుతున్నా ప్రజల కోసం ఒక బోరు వేసుటకు నిధులు కేటాయించడం జరిగింది అనంతరం తండా ప్రజల తో కలిసి నృత్యం చేసి అందర్నీ అనందింబ చేశారు ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ నియోజక వర్గ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని నెరవేరుస్తా నని ప్రజా ప్రభుత్వం నిత్యం ప్రజల కోసం పని చేస్తుంది అని మంత్రి వర్యులు సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles