సంపత్ వినాయగర్ ను హోం మంత్రి అనిత
విశాఖపట్నం జననేత న్యూస్.. రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి విశాఖపట్నం సంపత్ వినాయగర్ స్వామి వారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ అర్చకులు అనితకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. దేవాదాయ శాఖ సహాయ కమీషనర్ ,కార్యనిర్వహణాధికారి శిరీష పాల్గొని స్వామీ వారి చిత్ర పటం, వస్రం,ప్రసాదం అందజేశారు.. హోం మంత్రి అనిత మాట్లాడుతూ సంపత్ వినాయక స్వామినీ తరచు దర్శించుకొని వెళ్ళడం ఆనవాయితీ అని హోంమంత్రి అయిన తరువాత తొలిసారిగా ధర్శించుకున్నట్లు తెలిపారు.. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు. నాయుడు ఆలోచన అని దాని కనుగుణంగా శాంతి భద్రతలు విషయములో ఎవరు ఉసుగొలిపిన ,ఉపక్రమించిన వదిలే ప్రసక్తే లేదని చట్ట రీత్యా చర్యలు చేపడతాం అన్నారు.ఈ కార్యక్రమములో దేవాలయ సిబ్బంది జీ.గోవిందరెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర హోం మంత్రి వెంగలపూడి అనిత ఈరోజు సంపత్ వినాయకుడు దేవాలయం వద్ద ఆవిడ మాట్లాడారు
49