*విశాఖలో సందడి చేసిన విక్రమ్*
*–తంగలాన్ సినిమా ప్రమోషన్ టూర్*
*–15న చిత్రం* *విడుదల..ఆదరించాలని ప్రేక్షకులకు వేడుకోలు*
విశాఖలో సినీ నటుడు విక్రమ్ సందడి చేశారు. తంగలాన్ ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ మాళవిక మోహనన్, నిర్మాత జ్ఞానవేల్ రాజాతో మంగళవారం నగరంలోని రాడిసన్ బ్లూ లో మీడియా సమావేశం నిర్వహించారు. హీరో విక్రమ్ ‘తంగలాన్’తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా సినిమాని పా. రంజిత్ తెరకెక్కించారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 15న విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది చిత్ర బృందం. ఈ క్రమంలోనే వారు విశాఖకు వచ్చారు. స్వాతంత్య్రానికి పూర్వం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ సినిమాకు సంగీతం జి.వి.ప్రకాశ్ కుమార్, ఛాయాగ్రహణం ఎ.కిశోర్ కుమార్ సమకూర్చారు. ఈ సినిమాలో విక్రమ్ చాలా డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈనెల 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2022లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ చెన్నై, హైదరాబాద్, మధురై, కర్ణాటక సహా పలు లొకేషన్లలో చిత్రీకరించారు. చాలా రోజుల క్రితం ‘తంగలాన్’ ట్రైలర్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంది.ఇక తంగలాన్ సినిమాలో పార్వతి, మాళవిక మోహనన్, పశుపతి తదితరులు నటిస్తున్నారు. జి.వి. ప్రకాష్ సంగీతం సమకూర్చారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో పీరియాడికల్ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది.
———————