ప్రెస్ నోట్ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాలు ఆదాయం కోల్పోయిన ఆటో డ్రైవర్ కు ప్రత్యామ్నాయని చూపించాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో నష్టపోయిన ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఆదాయం చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తేదీ 12 8 2024 ఉదయం 10:30 కి జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర ధర్నా జరిగినది ఈ ధర్నా నుద్దేశించి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం పై పునర ఆలోచించాలని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లకు ప్రత్యమ్నయ ఆర్థిక ఆదాయం చూపించాలని కోరారు రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం టోల్ గేట్లు పెట్టాలన్న ప్రతిపాదనను వెంటనే విరమించాలని నిబంధనలకు విరుద్ధంగా ఉన్న విజయనగరం జిల్లా జొన్నాడ టోల్గేట్ విశాఖ జిల్లా అగనంపూడి టోల్గేట్లను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో దశలవారు ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వస్తే జరిమానాలు పెంచే జీవో నెంబర్ 21 మరియు 31 రద్దు చేస్తామని డీజలు పెట్రోల్ ధరలను జిఎస్టి పరిధిలోకి తెచ్చి ఆటో డ్రైవర్లు ఆదుకుంటామని బ్యాడ్జీమున్న డ్రైవర్లకు 15000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చి మూడు నెలలు గడిచిన ఒక్కటి అమలు చేయలేదని మండిపడ్డారు ఇప్పటికైనా టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం ఆటో అండ్ మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల గోవింద మాట్లాడుతూ పెరిగిన డీజీలు ఆటో విడి భాగాలు ధరలు తో పాటు ఓలా ఊబర్ రాపిడి వాహనాల వల్ల ఆదాయం కోల్పోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవలసిన ప్రభుత్వాలే ఆర్థిక బారాలు వేయడానికి కోరుకుంటున్నాయని మండిపడ్డారు ఆటో డ్రైవర్ల ఆర్థిక పై భారాలు వేసే జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఆర్టీవో పోలీస్ అధికారులు ఆటో డ్రైవర్ల మీద పెడుతున్న అక్రమ కేసులు వెంటనే ఆపాలని ఆటోల మీద ఉన్న పాత ఈ చలనాలు రద్దు చేయాలని ఆటో కు సిటీ పర్మినెంట్లు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ ధర్నాలు ఎన్ మధు రెడ్డి గాజువాక ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ చంటి అప్పలరాజు రావికృష్ణ అడ్డూరి శంకరు ఎస్ చెన్నారెడ్డి కొల్లి సన్యాసిరావు నూకరాజు ఎం అప్పలనాయుడు ఎల్ గోవిందు బంగారయ్య వై వెంకట్ ఎంఏ ఖాన్ అప్పలరాజు లక్ష్మణరావు అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ఇట్లు ఎన్ మధు రెడ్డి
జీవో నెంబర్ 21 ని రద్దు చేయాలి! ఆటో డ్రైవర్లకు PF, ESI, పెన్షన్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి AITUC
60