పవర్ సొల్యూషన్స్‌లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న కమ్మిన్స్ ఇండియా అత్యాధునిక జనరేటర్ ల శ్రేణిని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది.శుక్రవారం విశాఖపట్నం డాల్ఫిన్ హోటల్‌లో జాక్సన్ లిమిటెడ్ సంస్థతో కలిపి ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో సరికొత్త ఉద్గార కాంప్లిడ్ (సిపీ సి4+డీజీ) జనరేటర్ ను ఆవిష్కరించింది.దాదాపు ఏభై మంది పైగా వినియోగదారులు హాజరైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బ్రిగేడియర్ సురేష్ రామనాథన్ హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.జాక్సన్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ కౌశిక్ దత్తా గుప్తా,కమిన్స్ రీజనల్ హెడ్ సుశాంత్ శ్రీరామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కమ్మిన్స్ ఇండియా లిమిటెడ్ ఇండియా ప్రవేశపెట్టిన నూతన ఉత్పత్తి ఒక సాంకేతిక అద్భుతంగా అభివర్ణించారు.ఉత్తరాంధ్ర ఈవెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దువ్వి కాళీ ప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పవర్ సొల్యూషన్ లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న కమిన్స్ ఇండియా అత్యాధునిక జనరేటర్లు ప్రవేశపెట్టారు
61