వైజాగ్ సిటీ కమిషనర్ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం పెట్టి పోలీసులు ఇన్ఫర్మేషన్ నెంబర్ కూడా ఇచ్చారు

by vvwnews.com

*పత్రిక ప్రకటన*
*విశాఖపట్నం సిటీ,*
*తేదీ 10-08-2024.*

*దువ్వాడ స్టేషన్ పరిధిలో గల అప్పికొండ గ్రామం నందు నమ్మిదొడ్డి జంక్షన్ వద్ద ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన సిపి గారు.*

నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రాత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు ఈ రోజు నగరంలో ప్రజల సమస్యలు తెలుసుకొని, పరిష్కరించు నిమిత్తం, పోలీసులతో ప్రజలకు సత్సంబంధాలు మరింత మెరుగుపరుచు నిమిత్తం *ప్రజలతో ముఖాముఖి* కార్యక్రమం నిర్వహించడం జరిగినది.

*సిపి గారు నిర్వహించిన ఈ *ప్రజలతో ముఖాముఖి* కార్యక్రమ ముఖ్య ఉద్దేశం నగర శివార్లలో, పోలీసు స్టేషన్ కు సుదూర ప్రాంతాలలో నివాసముండే ప్రజలను కలిసి ఆయా ప్రదేశాలలో భద్రతాపరముగా ఉండే సమస్యలను, పోలీసింగ్ ను అక్కడి ప్రజలతో సిపి గారు నేరుగా మాట్లాడి తెలుసుకొని వాటిని సకాలంలో పరిష్కరించడం.*

ఈ రోజు దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గల అప్పికొండ గ్రామం నందు నమ్మిదొడ్డి జంక్షన్ వద్ద నిర్వహించిన *ప్రజలతో ముఖాముఖి* కార్యక్రమంలో స్థానికులు తమ సమస్యలను సిపి గారికి విన్నవించారు. వాటిలో ఆయా ప్రాంతాల రహదారుల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, కొన్ని ప్రాంతాలలో అధిక వేగం తో వాహనాలు నడుపుతున్నారని, కొన్ని శివరట్ ప్రాంతాలలో గంజాయి సేవిస్తున్నారని, లైటింగ్ తక్కువగా ఉందని, వారాంతాలలో పర్యాటకుల తాకిడి వల్ల విజిబుల్ పోలీసింగ్ ఏర్పాటు చేయమని, దొంగతనాలు జరుగకుండా నైట్ బీట్ లు పెంచమని, వీధి కుక్కలు ఎక్కువగా ఉండి, పసి పిల్లలపై దాడులు చేసి గాయాలపాలు అవుతున్నారని వాటిని నిర్మూలించాలని, పారిశ్రామిక ప్రాంతం కావడం వలన కొంత కాలుష్యం ఉందనీ, ఈ ప్రాంతాలను అనుసందానిస్తూ ఇంతక ముందర ఆరు ఆర్.టి.సి బస్సులు సర్వీస్ నడిపేవని, ఇప్పుడు వాటి సంఖ్య మూడు కు తగ్గించారని, పూర్తి బస్ సర్వీసు లను తిరిగి ఏర్పాటు చేయమని, అనారోగ్యం కలిగినప్పుడు ఆసుపత్రికి తరలించుటకు అంబులెన్స్ ఏర్పాటు చేయమని కోరారు.
ఆయా ప్రాంత ప్రజల సమస్యలు విన్న సిపి గారు ట్రాఫిక్ సమస్యని, అధిక వేగం తో నడిపే వాహనాలను వెంటనే అరికడతామని, గంజాయి సేవిస్తున్న వారిని ప్రత్యేక టీంలతో నిఘా ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, శని ఆది వారాలలో ప్రత్యేక విజిబుల్ పోలీసింగ్ ఏర్పాటు చేస్తామని, నైట్ బీట్ ల సంఖ్య పెంచుతామని తెలిపారు, లైటింగ్, వీధి కుక్కల బెడద, ఆర్.టి.సి బస్సులు సర్వీసులు పై ఆయా సంబంధిత అధికారులతో చర్చించి తక్షణం సానుకూల చర్యలు తీసుకోవడం కోసం తమ వంతు ప్రయత్నం చేస్తామని, చుట్టుపక్కల పారిశ్రామిక సంస్థల తో సంబంధిత పోలీసు అధికారులు కలిసి,మాట్లాడి తక్షణం అంబులెన్స్ అందుబాటులోనికి తెస్తామని తెలిపారు, త్వరలోనే పై సమస్యలు పరిష్కరించబడడం మీరు చూస్తారని, నగర పోలీసు శాఖ మీకు 24/7 అందుబాటులో ఉంటూ , తమ భద్రతకు ఎల్లవేళలా పాటుపడుతుందని ఈ సందర్భముగా సిపి గారు తెలియజేశారు.

ఈ సందర్భముగా సిపి గారు మాట్లాడుతూ విశాఖ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో గల ప్రజలు అందరూ *7995095799* నంబరును సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని, నగర ప్రజలు ఎటువంటి సమాచారం కలిగి ఉన్నా, ఎవరైనా పోలీసులు పట్టించుకోవడం లేదన్నా, లంచం అడిగినా లేదా తీసుకున్నా యెటువంటి సమస్యలు ఉన్నా పై నంబరు ద్వారా స్వయంగా నాకు తెలియజేయండి, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో డి.సి.పి-02(ఎల్& ఓ) శ్రీ తుహిన్ సిన్హా,ఐ.పీ.ఎస్., గారు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

నగర పోలీసు తరపున,
విశాఖపట్నం సిటీ.

Use Social Media to Spread the Word about Our News

related articles