గ్రీన్ క్లైమేట్ టీం దోమల నుండి సంరక్షించుకోవడం ఎలా అవగాహన కల్పిస్తూ సమత డిగ్రీ కాలేజ్ MVP VISAKHA 17

by vvwnews.com

దోమ చిన్నదే కానీ కుడితే చాలా ముప్పే
– జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణకు సహకరించండి.
– మలేరియా, డెంగ్యూ వ్యాధులను అరికడదాం
– దోమల పుట్టకుండా, కుట్టకుండా సహకరించండి.
జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో
దోమ చిన్నదే కానీ కుడితే చాలా ముప్పే అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం హెచ్చరించారు. సోమవారం ఉదయం ఎంవిపి కాలనీ లోని సమత డిగ్రీ కళాశాలలో డైరెక్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు దోమలు కుట్టడం వల్ల వచ్చే వ్యాధుల గురించి గ్రీన్ క్లైమేట్ టీం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాఫిలస్, క్యూలెక్స్, ఎడిస్ ఆడ దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, మెదడువాపు, బోద వ్యాధులు ప్రబలుతాయి అన్నారు. వీటి నివారణకు దోమలు పుట్టకుండా కృషి చెయ్యాలి అన్నారు. జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించండి అని కోరారు. మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా , బోద, మెదడు వాపు వ్యాధులను అరికడదాం అన్నారు. మూడు రోజులకు మించి ఎక్కడా మంచి నీళ్ళు నిల్వ ఉండకుండా చూడాలి అని కోరారు.ఎయిర్ కూలర్, ఫ్రిజ్ నుండి వచ్చే నీళ్ళు ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు. పక్షులు, జంతువులు కోసం నీరు పెట్టె పాత్రలను మూడు రోజులకు ఒకసారి శుబ్రపరిచాలని కోరారు.పాత టైర్లు, తాగి పడవేసె కొబ్బరి బొండాలలో నీళ్ళు నిల్వ ఉండకుండా చూడాలి అన్నారు.
ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రామకృష్ణ మాట్లాడుతూ దోమల నివారణకు సహకరించండని ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లను కోరారు. విస్తృతంగా ప్రచారం చెయ్యాలి అని కోరారు.
ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు మాట్లాడారు.

Use Social Media to Spread the Word about Our News

related articles