పర్యావరణ దినోత్సవం జరుపుకోవాలి మనమందరము ప్రతి ఒక్క ఇంటిలో మొక్కల్ని పెంచాలి

by vvwnews.com

భూగోళం మీద సమస్త జీవరాశినీ కాపాడవలసిన బాధ్యత మానవాళిదె
– ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జయప్రదం చేయండి
– ఎకొ వైజాగ్ నుంచి విజయవంతం చేయాలి, మొక్కలు నాటి పెంచాలి
– ప్రకృతి ఆధారంగా పంటలు పండించండి, ఆరోగ్యంగా జీవించండి
– అరవల అరుణ, చీప్ అడ్మిన్, వనమాలి గార్డనర్స్ క్లబ్
భూగోళం మీద సమస్త జీవరాశినీ కాపాడవలసిన బాధ్యత మానవాళిదె అని వనమాలి గార్డనర్స్ క్లబ్ చీప్ అడ్మిన్ అరవల అరుణ అన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం మురళీ నగర్ లోని సుదర్శన్ పార్క్ లో ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రచారం “మన భూమి” అనే అంశం తో నిర్వహించడం జరిగుతుందని వివరించారు. ఈ సందర్భంగా మన భూమిని మనమే కాపాడుకోవాలి అనె ఆలోచనతో వనమాలి గార్డనర్స్ క్లబ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి ఆధారిత పంటలు పండించే విధానం మీద శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరిగుతుంది అన్నారు
అడ్మిన్ మళ్ళ సరిత మాట్లాడుతూ ఈ ఏడాది నినాదం “మా భూమి. మన భవిష్యత్తు. మేము, మా తరం భూమి పునరుద్ధరణ.” అని వివరించారు.. తమ సంస్థ విశాఖపట్నం లో ఇళ్ల పైకప్పులు మీద విస్తృతంగా కూరగాయలు, ఆకుకూరలు ప్రకృతి ఆధారిత పంటలు పండిస్తున్నామన్నారు. ఈ విధంగా పంటలు సంఖ్య గణనీయంగా పెంచేందుకు కృషి చెయ్యడానికి తాము కృషి చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, ఏక్షన్ ఎయిడ్ ఫెలోషిప్ ప్రతినిధి కృష్ణకుమారి, సుదర్శన్ పార్క్ ప్రతినిధులు ఎం ఆర్ కె రంగారావు సి శ్రీనివాస్ రావు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రతినిధి ఆళ్ళపాటి శ్రీనివాసరావు, మినియేచర్స్ స్పెషలిస్ట్ రమాదేవి,
మురళీ నగర్ లోని వివిధ వాకర్స్ క్లబ్ లో ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, వనమాలి గార్డనర్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు .
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం అందజేసిన పిచ్చుకల గూళ్ళు పంపిణీ చేశారు, 20 రకాల మొక్కలు పార్కులోనూ, పార్క్ బయటా నాటారు, గార్డెనర్స్ తీసుకుని వచ్చిన మొక్కలు, విత్తనాలు ఉచితంగా పంపిణీ చేశారు.

Use Social Media to Spread the Word about Our News

related articles