ప్రతీ రోజూ పర్యావరణ పరిరక్షణ దినోత్సవమే
– ఎకో వైజాగ్ కోసం పర్యావరణ హితంగా జీవించండి
– ప్రకృతి ఆధారంగా పంటలు పండించండి, ఆరోగ్యంగా జీవించండి
– పివి ముకుంద రావు రీజనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి
ప్రతీ రోజూ పర్యావరణ పరిరక్షణ దినోత్సవమే అని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ ఎన్విరాన్మెంటల్ పివి ముకుంద రావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం ఎంవిపి కాలనీ లోని సమతా కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఒక్కరూ తమ కర్తవ్యంగా భావించి పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. భూగోళం మీద సమస్త జీవరాశినీ కాపాడవలసిన బాధ్యత మానవాళిదె అన్నారు. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రచారం “మన భూమి” అనే అంశంతో నిర్వహించడం జరిగుతుందని వివరించారు. ఈ సంవత్సరం పర్యావరణ పరిరక్షణ దినోత్సవం నేపథ్యం (థీమ్)- భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ, కరువును తట్టుకునే శక్తిపై దృష్టి సారిస్తుందని ఐక్యరాజ్యసమితి పేర్కొందన్నారు. ఈ ఏడాది నినాదం “మా భూమి. మన భవిష్యత్తు. మేము, మా తరం భూమి పునరుద్ధరణ.” అని వివరించారు. ప్రతీ ఒక్కరూ 10 మొక్కలు నాటి పెంచే విధంగా చైతన్య వంతులు చేయాలని కోరారు. విశాఖపట్నం మహానగరాన్ని ఒక సామాజిక వనం గా తీర్చి దిద్దాలని కోరారు. ఇందుకు తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు.
ఎపి కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ ఇంజనీర్ ఎ ఎస్ ఆర్ సి మూర్తి మాట్లాడుతూ ప్రకృతి ఆధారిత పంటలు పండించే వారికి ప్రోత్సాహం అందించడం అవసరం అన్నారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం గురించి పర్యావరణంపై ప్రముఖంగా ప్రపంచ నినాదాన్ని, నాయకత్వాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు రాజీ పడకుండా దేశాలు, ప్రజలు వారి జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు స్ఫూర్తిని ఇవ్వడం, తెలియజేయడం , అమలు చేయాలని కోరడం ద్వారా పర్యావరణ సంరక్షణలో భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందన్నారు.
సమత కళాశాల డైరెక్టర్ శ్రీనువాసరావు మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యు ఎన్ ఇ పి) నేతృత్వంలో, ప్రతి సంవత్సరం 150 దేశాలు పాల్గొంటాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, సమూహాలు, ప్రభుత్వాలు, ప్రముఖులు పర్యావరణ పరిరక్షణ అంశాల కోసం “ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం” నిర్వహిస్తున్నారు అని వివరించారు.
సమత కళాశాల బోటనీ ఫేకల్టి రాజా ప్రవీణ మాట్లాడుతూ ఎకో వైజాగ్ కోసం పర్యావరణ హితంగా జీవించండి అని పిలుపునిచ్చారు. పర్యావరణ హితంగా విద్యార్థులు జీవించడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగుతోంది అన్నారు. తమ కళాశాలలో ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్కలు పెంచడం జరుగుతుంది అని వివరించారు
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, ఇంగ్లీష్ ఫేకల్టి శ్రీదేవి, సంస్కృతం ఫేకల్టి శ్రీదేవి తదితరులు మాట్లాడారు. ఏక్షన్ ఎయిడ్ ఫెలోషిప్ ప్రతినిధి కృష్ణకుమారి, గ్రీన్ క్లైమేట్ టీం వాలంటీర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఔషధ మొక్కలు పరిశీలించారు.
ప్రతిరోజు పర్యావరణ దినోత్సవం జరుపుకోవాలి మనమందరము Eco Vizag & గ్రీన్ క్లైమేట్ టీం
49