ఏప్రిల్ 22తేదీ వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా గ్రీన్ క్లైమేట్ టీం మరియు మాధవధార వాకర్స్ క్లబ్ నిర్వహించిన

by vvwnews.com

ధరిత్రి దినోత్సవం జయప్రదం చేయండి.
-జెవి రత్నం వ్యవస్థాపక కార్యదర్శి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ
ధరిత్రి దినోత్సవం జయప్రదం చేయండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోరారు. ఆదివారం సాయంత్రం
మహిళా వాకర్స్ క్లబ్ నేతృత్వంలో మాధవధార ఈస్ట్ పార్క్ లోమహిళా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యం లో వాకర్స్, పిల్లలు, విద్యార్థులు, మహిళలు పురుషులు అందరికి ఎకో వైజాగ్ లో బాగంగా ఎర్త్ డే అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 22వ తేదీ ప్రపంచ ధరిత్రి దినోత్సవం జయప్రదం చేయాలని కోరారు. భూతాపాన్ని నివారించేందుకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అనేది వివరించారు.అసలు ఎందుకు గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల కలిగే అనర్ధాలు తెలిపారు. చెట్లు నరకడం వల్ల కలిగే నష్టాలు, కాంక్రీటు జంగిల్ గా మారుతున్న నగరాలలో ఏర్పడుతున్న కష్టనష్టాలు వివరించారు. పిల్లలకి చిన్నప్పటినుంచి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా నీటిని ఎలాగా పొదుపు చేయాలి ఎలా వినియోగించాలి. ప్రతి ఒక్క ఇంటి ముందు కూడా ఇంకుడు గుంతలు తవ్వించాలి అలాగే బహుళ అంతస్తులు కూడా ఇంకుడు గుంతలు తవ్వించాలి అని కోరారు. ఇంట్లో వంట గదిలో వాడుకునే కూరగాయలు కడిగి నీరు బియ్యం కడిగింది వృధా చేయకుండా మొక్కలకి పోయడం అలాంటి పొదుపు చర్యలు తీసుకుంటే చాలా మంచిది అన్నారు. కొంతవరకైనా మనం భూతాపాన్ని నివారించడానికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు జానకి టీచర్ అందరూ పాల్గొని ధరిత్రి దినోత్సవం విజయవంతం చేయాలని కోరారు.

Use Social Media to Spread the Word about Our News

related articles